తల్లికి వందనం రెండో విడత.. 3.29 లక్షల మందికి రూ.13,000 | Talliki Vandanam Scheme
Talliki Vandanam Scheme Second Installment 13000 AP : తల్లికి వందనం పథకం కింద రెండో విడత సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్‌కు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఎంవో నుంచి తుది అనుమతి రావాల్సి ఉంది.
తుది ఆమోదం వచ్చిన తర్వాత ఒకట్రెండు వారాల్లో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేసే అవకాశం ఉంది. ఈ విడతలో మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ప్రయోజనం అందనుంది.

గతంలో కొన్ని కారణాల వల్ల తల్లికి వందనం సాయం అందని వారికి కూడా ఈ విడతలో అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులతో పాటు సాంకేతిక సమస్యల కారణంగా గతంలో నగదు జమ కాని అర్హులకు ఈ సాయం అందనుంది.
ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం పూర్తయిన నేపథ్యంలో సీఎంవో తుది అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆమోదం వచ్చిన వెంటనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
అర్హులైన విద్యార్థుల తల్లులు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. అధికారికంగా చెల్లింపుల తేదీ ప్రకటించిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


