ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కులు
Telangana Inter First Year Internal Marks 2026 Latest News : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సమాచారం వెల్లడించింది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఇంటర్నల్ మార్కుల విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ఈ విధానం అమల్లోకి రానుంది.
కొత్త విధానం ప్రకారం లాంగ్వేజెస్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టుల్లో మొత్తం మార్కుల్లో 80 శాతం థియరీ పరీక్షలకు, మిగిలిన 20 శాతం మార్కులను ఇంటర్నల్‌కు కేటాయించనున్నారు. కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంచడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.
అందువల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇకపై థియరీ పరీక్షలతో పాటు కాలేజీలో నిర్వహించే ఇంటర్నల్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త మార్కుల విధానానికి అనుగుణంగా విద్యార్థులు తమ చదువును కొనసాగించడం ముఖ్యంగా మారనుంది.


