India Post GDS Result 2026: 23,757 ఉద్యోగాల ఫలితాలు ఎప్పుడంటే?
India Post GDS 1st Merit List Result 2026 Date : పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. దేశవ్యాప్తంగా 23,757 పోస్టులకు త్వరలో మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా ఫలితాలను ఇండియా పోస్ట్ అధికారిక GDS https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

అక్టోబర్ 10 నాటికి ఫలితాలు :GDS నియామకానికి సంబంధించిన ఫలితాలను అక్టోబర్ 10, 2026 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి, రాష్ట్రాల వారీగా రిజల్ట్స్‌ను ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌లో తమ రాష్ట్రాన్ని ఎంచుకుని మెరిట్ లిస్ట్‌ను చెక్ చేసుకోవచ్చు.
23,757 పోస్టులకు నియామకం : ఈ రిక్రూట్‌మెంట్‌లో గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టులో విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 21, 2026తో ముగిసింది.
పదో తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక : ఈ పోస్టులకు సాధారణంగా ప్రత్యేక రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కిన అభ్యర్థులు తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫలితాల కోసం తరచూ ఇతర వెబ్‌సైట్లను నమ్మకుండా ఇండియా పోస్ట్ అధికారిక GDS పోర్టల్‌ను మాత్రమే పరిశీలించడం మంచిది. ఫలితాలు విడుదలైన వెంటనే రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకునే విధానం : ఫలితాలు విడుదలైన తర్వాత indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ సంబంధిత GDS రిక్రూట్‌మెంట్ ఫలితాల విభాగంలోకి వెళ్లి, మీ రాష్ట్రానికి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఓపెన్ చేసి పేరు లేదా రిజిస్ట్రేషన్ వివరాలతో ఫలితాన్ని పరిశీలించుకోవచ్చు. అక్టోబర్ 10 నాటికి ఫలితాలు వస్తాయని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అంచనా మాత్రమే. అధికారికంగా ఫలితాల తేదీ ప్రకటించిన తర్వాతే తుది తేదీగా పరిగణించాలి.

🛑India Post GDS 1st Merit List Result 2026 Direct Link

