Anganwadi Jobs : అంగన్వాడీ టీచర్ పోస్టులు.. 55 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
Anganwadi Teacher Recruitment 2026 Hanamkonda 55 Posts : తెలంగాణ మరొక జిల్లాలో 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇంటర్ అర్హతతో 18-35 ఏళ్ల అభ్యర్థులు అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణలో హనుమకొండ, నారాయణపేట & నిర్మల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మంచి అవకాశం వచ్చింది. జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు తేదీలు : అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను wdcw.tg.nic.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు సమయంలో పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అనాథలు సంబంధిత అనాథ సర్టిఫికెట్‌ను జత చేయాలి.
విద్యార్హత, వయస్సు : అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి (ఇంటర్) ఉత్తీర్ణులై ఉండాలి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ పోస్టుల భర్తీలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు కేటాయించిన పోస్టుల్లో సంబంధిత గ్రామానికి చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఎంపిక విధానం : అంగన్వాడీ టీచర్ పోస్టులకు మొత్తం 100 మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్‌లో సాధించిన మార్కుల మెరిట్‌కు 70 మార్కులు కేటాయిస్తారు. వితంతువులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు అదనంగా లభిస్తాయి. అలాగే జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయి. ఈ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దివ్యాంగులకు ప్రత్యేక అర్హతలు
వినికిడి పరికరాల సహాయంతో వినగలిగే వారు, ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వహించగలిగే అంధులు, అలాగే కాళ్లు లేదా చేతులకు సంబంధించిన అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రీస్కూల్ బోధనకు ఆటంకం లేని అభ్యర్థులు అర్హులుగా పరిగణిస్తారు.
ఖాళీల వివరాలు : హనుమకొండ జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 55 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో భీమదేవరపల్లి ప్రాజెక్టులో 23, హనుమకొండలో 19, పరకాలలో 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, స్థానికతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

🛑Notification Pdf Click Here
🛑 Vacancy List Click Here
🛑Apply Online Link Click Here

