AP Pension: ఏపీ పెన్షనర్లకు కీలక మార్పు.. కేంద్రం వాటా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి
AP Pension Central Share Directly Bank Account October 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ తీసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం వాటాకు సంబంధించి కీలక మార్పు రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 62 లక్షల మంది వివిధ సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) పరిధిలో సుమారు 9.34 లక్షల మంది ఉన్నారు.
ఈ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రాష్ట్రానికి ప్రతి ఏడాది సుమారు రూ.382 కోట్లను అందిస్తోంది. అయితే అక్టోబర్ 1 నుంచి కేంద్రం తన వాటాను నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.
కేంద్రం నుంచి వచ్చే ఈ వాటా లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.200 నుంచి రూ.500 వరకు ఉండనుంది. మిగిలిన పెన్షన్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధిత స్వర్ణ ఉద్యోగులు ఎప్పటిలాగే లబ్ధిదారులకు అందిస్తారు.
ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి : కేంద్రం వాటా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఈ కేటగిరీకి చెందిన పెన్షన్ లబ్ధిదారులు తమ ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవాలి. బ్యాంక్ ఖాతా వివరాల్లో సమస్యలు ఉంటే ముందుగానే సరిచేసుకోవడం మంచిది.
అందువల్ల NSAP కింద పెన్షన్ పొందుతున్న వారు తమ ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా సక్రమంగా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అక్టోబర్ 1 నుంచి కేంద్రం వాటా నేరుగా ఖాతాలోకి రావడంతో పెన్షన్ చెల్లింపుల విధానంలో ఈ మార్పు అమల్లోకి రానుంది.

