AP DSC Notification 2026 : అక్టోబర్ 15న మరో DSC నోటిఫికేషన్.. 2,500+ పోస్టులు?

AP DSC Notification 2026 : అక్టోబర్ 15న మరో DSC నోటిఫికేషన్.. 2,500+ పోస్టులు?

AP DSC Notification 2026 2500 Teacher Jobs : ఏపీలో మరో DSC నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. DSCతో పాటు డైట్, NCERT, ఇంటర్ లైబ్రేరియన్ పోస్టులతో 2,500కు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉంది.

•త్వరలో మరో DSC.. నోటిఫికేషన్ డేట్ ఫిక్స్

•DSCతో పాటు డైట్, NCERT, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీ.

•మొత్తం 2,500కు పైగా పోస్టులతో OCT 15న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరోసారి శుభవార్త అందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరో DSC నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలను విద్యాశాఖ సేకరించింది. ఆయా ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిన పోస్టులపై ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి DSCతో పాటు డైట్, NCERT, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 2,500కు పైగా పోస్టులు భర్తీ చేసేలా నోటిఫికేషన్ తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పోస్టుల సంఖ్య, విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలు వంటి పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.

ఇక రాష్ట్రంలో ప్రతి ఏడాది DSC నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీచర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు కొత్త నోటిఫికేషన్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 15 తేదీ, పోస్టుల సంఖ్య వంటి వివరాలు ప్రస్తుతం అందుతున్న సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తుది వివరాలను నిర్ధారించుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *