ఏపీలో పోలీస్ ఉద్యోగాలు 2,050 పోస్టులు మైనారిటీలకు ఉచిత శిక్షణ ఈ నెల 30 వరకు దరఖాస్తులు | AP Police Jobs 2026

ఏపీలో పోలీస్ ఉద్యోగాలు 2,050 పోస్టులు మైనారిటీలకు ఉచిత శిక్షణ ఈ నెల 30 వరకు దరఖాస్తులు | AP Police Jobs 2026

AP Police Jobs 2026 Free Training Minority Candidates : ఏపీలో ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో.. మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు.

పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడాలనుకునే అర్హత ఉన్న మైనారిటీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30లోగా https://www.apcedmmwd.org/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వద్ద రేషన్ కార్డు లేదా BPL కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పోలీస్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

2,050 పోలీస్ పోస్టుల భర్తీ : ఇక రాష్ట్రంలో వివిధ విభాగాల్లో మొత్తం 2,050 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇందులో ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు ఇతర సాంకేతిక విభాగాల పోస్టులు కూడా ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన మరో నాలుగు నోటిఫికేషన్లలో కమ్యూనికేషన్ విభాగంలో 200 పోస్టులు, మెకానిక్స్‌లో 15 పోస్టులు, డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులు 198, కమ్యూనికేషన్ విభాగంలో మరో 50 పోస్టులు, ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10 ఎస్సై పోస్టులు, 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే సివిల్, ఏఆర్, ఫైర్‌మెన్, ఎస్పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి. వీటితో కలిపి మొత్తం 2,050 పోస్టులను భర్తీ చేయనున్నారు.

378 ఎస్సై.. 1,156 కానిస్టేబుల్ పోస్టులు ప్రధాన పోలీస్ నియామకాల్లో భాగంగా 378 ఎస్సై పోస్టులు, 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై పోస్టుల్లో సివిల్ ఎస్ఐ 253, ఏఆర్ ఎస్ఐ 116, ఎస్పీఎఫ్ ఎస్ఐ 9 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్ కానిస్టేబుల్ 542, ఏఆర్ కానిస్టేబుల్ 285, ఫైర్‌మెన్ 158, జైల్ వార్డర్ (పురుషులు) 150, జైల్ వార్డర్ (మహిళలు) 21 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ప్రిలిమినరీ పరీక్ష తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) తెలిపింది.
అభ్యర్థులు https://slprb.ap.gov.in/ అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించిన తర్వాతే అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను తెలుసుకుని అప్లై చేయడం మంచిది. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు సంబంధించిన వివరాలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *