ఏపీలో రైతులకు అలర్ట్.. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అయితేనే పీఎం కిసాన్ డబ్బులు | AP PM Kisan
AP PM Kisan Farmer Registry Registration : APలో పీఎం కిసాన్ సాయం పొందే రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచన. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి. రైతు సేవా కేంద్రాలు, APAIMS 2.0 యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ పథకం కింద రూ 6,000/- ఆర్థిక సాయం పొందుతున్న రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచన చేసింది. ఇకపై పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ తెలిపారు.
పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ ప్రయోజనం కొనసాగాలంటే రైతులు తమ వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో పీఎం కిసాన్ పథకం పరిధిలో సుమారు 64.71 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 52.06 లక్షల మంది మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఇంకా నమోదు చేసుకోని రైతులు ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు. అలాగే APAIMS 2.0 యాప్ ద్వారా కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకునే అవకాశం ఉంది.

కాబట్టి పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతులు తమ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు పూర్తయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నమోదు చేయని వారు వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.

