AP ASHA Worker Jobs 2026: 10th అర్హతతో ఆశా కార్యకర్తల పోస్టులు.. సెప్టెంబర్ 25 చివరి తేదీ
AP NHM ASHA Worker Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్లో NHM కింద ASHA కార్యకర్తల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 25, 2026.
ఆంధ్రప్రదేశ్లో ఆశా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆశా పోస్టులను భర్తీ చేయడానికి, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లో ఆశా కార్యకర్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, వయస్సు, దరఖాస్తు విధానము, ముఖ్యమైన తేదీ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
ఈ రిక్రూట్మెంట్లో ముఖ్యంగా 10వ తరగతి విద్యార్హతతో ఆశా కార్యకర్త జాబ్స్ కి తప్పనిసరిగా గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి. అభ్యర్థుల, వయసు, రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.

AP ASHA Worker Notification 2026 ఉద్యోగాలకు ముఖ్యమైన వివరాలు
• శాఖ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కమ్యూనిటీ ప్రాసెస్ నేషనల్ హెల్త్ మిషన్ NHM పథకంలో
• రిక్రూట్మెంట్ సంస్థ: జిల్లా లో రూరల్ మరియు అర్బన్, Andhra Pradesh
• పోస్టు: ఆశా కార్యకర్తల నియామకము
• మొత్తం ఖాళీలు: 71
• విద్యార్హత: 10వ తరగతి
• వయసు: 25 నుంచి 45 సంవత్సరాలు
• ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
విద్యార్హత : ఆశా తప్పనిసరిగా గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి, ప్రాధాన్యంగా ‘వివాహిత / వితంతువు / విడాకులు తీసుకున్న / విడిపోయిన’ అయి ఉండాలి.ఆశా కార్యకర్తలకు సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు ఉండాలి మరియు సమాజానికి చేరువయ్యే సామర్థ్యం. ఆమె కనీసం 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన అక్షరాస్యురాలు అయి ఉండాలి. ఆమె తన పనులను పూర్తి చేయడానికి సమయం కేటాయించుకోవాలంటే, ఆమెకు కుటుంబ మరియు సామాజిక మద్దతు ఉండాలి. ఆ ప్రాంతంలో ఈ అర్హత కలిగిన తగిన మహిళ అందుబాటులో లేకపోతే, విద్యా మరియు వయో ప్రమాణాలను సడలించవచ్చు
వయోపరిమితి : అభ్యర్థుల 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గలదై ఉండాలి.
ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు : ఇంటర్వ్యూ సెలక్షన్ చేస్తారు.
అభ్యర్థులు తమ దరఖాస్తును క్రింది పత్రాలతో పాటు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHC) సక్రమంగా అందజేసి సమర్పించాలి.
1. ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ కాపీ (పుట్టిన తేదీకి రుజువు)
2. సంబంధిత ప్రాంతపు గ్రామ గృహ స్వచ్ఛంద సంఘం (VHNC) వారి తీర్మానం మరియు ఆమోదం యొక్క నకలును జతచేయాలి.
3. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల విషయంలో సంబంధిత మండల రెవెన్యూ అధికారులు జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం కాపీ, లేని పక్షంలో వారిని ఓసీలుగా పరిగణిస్తారు.
4. సర్టిఫికేట్/ఆధార్ కార్డు/రేషన్ కార్డు మొదలైన వాటి కాపీ.
5. అభ్యర్థి పి.హెచ్. కోటాకు దరఖాస్తు చేసుకున్నట్లయితే- మెడికల్ బోర్డు (SADAREM) జారీ చేసిన తాజా వైకల్య ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి
దరఖాస్తు తేదీలు ఎప్పుడు?
•నోటిఫికేషన్ జారీ అయినట్లయితే తేదీ : 15-09-2026
•దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 25-09-2026
•తాత్కాలిక మెరిట్ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాల స్వీకరణ : 12-10-2026
•తుది మెరిట్ జాబితా మరియు ఎంపిక ప్రచురణలు : 19-10-2026
•సంబంధిత వైద్య అధికారులకు అనుమతి జారీ చేయండి : 27-10-2026
ఈ యొక్క ఆశా కార్యకర్తల నియామకం గ్రామీణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ (VHSNC) ద్వారా వచ్చిన దరఖాస్తుల నుండి అర్హత మరియు ప్రతిభ కలిగిన ముగ్గురు అభ్యర్థుల అప్లికేషన్స్ జిల్లా ఆఫీసులకు పంపించవలెను వచ్చిన అప్లికేషన్స్ డిస్ట్రిక్ హెల్త్ సొసైటీ (DHS) ద్వారా నియామకములు జరుగుతాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిణి డా. U శోభ గారు తెలియజేయడం జరిగింది.

🛑1stNotification Pdf Click Here
🛑2ndNotification Pdf Click Here
🛑Official Website Click Here

