AP Anganwadi Helper Jobs 2026 | 7th అర్హతతో ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | Apply Now
AP Government Notification for recruitment of Anganwadi Helpers Posts: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలోని ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 85 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ కొరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.
ముఖ్యమైన వివరాలు
• ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలో అంగన్వాడి హెల్పర్ 85 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
• పరీక్ష లేదు, ఫీజు లేదు అప్లై చేసుకుంటే సొంత ఊరిలో ఉద్యోగం.
• కేవలం 7th పాస్ అయితే, స్థానికంగా నివసిస్తున్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: 21.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు

AP Anganwadi Helper Jobs 2026 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం లో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 01.07.2026 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. రాత పరీక్ష లేకుండా, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ నియామక ప్రక్రియను ప్రభుత్వం జారీ చేసిన ప్రస్తుత ఉత్తర్వులు, మార్గదర్శకాలు మరియు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించబడును.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడీ హెల్పర్ 85 పోస్టుల ఉద్యోగాల నియామకం ఉన్నాయి.
అవసరమైన విద్యా అర్హత :
1. ప్రధానముగా స్థానిక స్థిరనివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
2. అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేయ గోరు అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.
3. తేది 01.07.2026 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
4. నోటిఫై చేయబడిన SC / ST అంగన్వాడీ కేంద్రములకు SC/ST అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన SC / ST అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్ధులు అందుబాటులో లేనప్పుడు, 18సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును.
గరిష్ట వయో పరిమితి : తేది 01.07.2026 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
•నెల జీతం : అంగన్వాడీ హెల్పర్ పోస్టు గౌరవ వేతన ప్రాతిపదికన తాత్కాలిక నియామకము మాత్రమే. ఎంపికైన అభ్యర్ధులకు ప్రభుత్వం అమలులో ఉంచిన నిబంధనలు మరియు ఉత్తర్వుల ప్రకారం నెలకు రూ.7,000/- (ఏడు వేల రూపాయలు మాత్రమే) గౌరవ వేతనంగా చెల్లించబడును.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో
•ఎంపిక విధానం : అర్హత పొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) తేదీ, సమయం మరియు వేదిక వివరాలు తరువాత ప్రత్యేకంగా తెలియజేయబడును. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించబడిన తేదీ, సమయం మరియు స్థలమునకు తప్పనిసరిగా హాజరుకావలెను. నిర్ణీత తేదీన హాజరు కాని అభ్యర్ధుల అభ్యర్థిత్వము రద్దు చేయబడును.

•దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తుల స్వీకరణ తేదీ 08.09.2026 నుండి ప్రారంభమై 21.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగును. నిర్దేశిత గడువు అనంతరం అందిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవు మరియు అవి తిరస్కరించబడును. అదేవిధంగా, అసంపూర్ణ దరఖాస్తులు, నిర్దేశిత ధృవీకరణ పత్రాలు జతపరచని దరఖాస్తులు లేదా అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని దరఖాస్తులు తిరస్కరించబడును. కావున, పై పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి మరియు ప్రాధాన్యతలు కలిగిన అర్హులైన మహిళా అభ్యర్ధులు తమ పూర్తి బయోడేటాతో పాటు నివాస, కుల, విద్యార్హత, వివాహ స్థితి, వయస్సు మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రాల గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన నకళ్లను జతపరచి, తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి (CDPO) కార్యాలయమునకు నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గాని సమర్పించి తగు రశీదు పొందవలయును.

ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 08.09.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 21.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు

🛑NotificationPdf Click Here
🛑Application Pdf Click Here


