రాత పరీక్ష లేకుండా టెన్త్ అర్హతతో 913 ఆశ పోస్టుల భర్తీ.. అర్హతలివే! ASHA posts

రాత పరీక్ష లేకుండా టెన్త్ అర్హతతో 913 ఆశ పోస్టుల భర్తీ.. అర్హతలివే! ASHA posts

Andhra Pradesh 913 ASHA posts.. Eligibility is required : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు లో 913 ఆశా ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 1294 పోస్టుల భర్తీ చేసిన సంగతి తెలిసినదే. కొత్తగా 913 ఉద్యోగులతో భర్తీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్టిక్ వెల్ఫేర్ సొసైటీలో ఈనెల 30 లోపు ఆశా వర్కర్ నియామకం చేపట్టాలని అన్నారు. అర్హత సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలలో  పరిధిలో నివసిస్తున్న మహిళా అభ్యర్థులు టెన్త్ పాస్ అయి ఉండాలి. తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి. 25-45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి నెలకి గౌరవ వేతనం రూ.10,000 వరకు ఇస్తారు. ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా కలెక్టర్ ఆదేశాల పైన జారీ చేస్తారు. మరిన్ని వివరాల కోసం https://igod.gov.in/sg/AP/E042/organizations అధికార వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ & అర్బన్ లో ఆశా వర్కర్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పదో తరగతి అర్హత ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు డిస్టిక్ లో హెల్త్ కార్యాలయంలో వెళ్లేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, కుల దృవీకరణ పత్రం, అప్లికేషన్ ఫామ్ & పదో తరగతి మార్క్ షీట్ తదితర డాక్యుమెంట్స్ ను జిరాక్స్ తీసి నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకొని పూరించిన తమ దరఖాస్తుతో పాటు, అవసరమైన సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితాల జీరాక్స్ కాపీలతో 30-09-2025 సాయంత్రం 05:00 వరకు అర్బన్ ప్రాంతం వారు వార్డ్ సెక్రటేరియట్ పరిధిలోని UPHC మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే గ్రామీణ ప్రాంతం వారు ఆ గ్రామం పరిధిలోని PHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా అందజేయవలెను. నిర్నీత గడువు ముగింపు తర్వాత అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరించబడవు.

పట్టణం అభ్యర్ధులు వారు ఖాళీల జాబితా నందు సూచించిన స్థానిక వార్డ్ సెక్రటేరియట్ లలో, అలాగే గ్రామం అభ్యర్థులు ఖాళీల జాబితా నందు సూచించిన గ్రామం లో నివాసం ఉండి ఆ వార్డ్, గ్రామం యొక్క కోడలు అయి ఉండే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. వేరే వార్డ్ సెక్రటేరియట్, వేరే గ్రామం కు చెందిన అభ్యర్థులు పరిగణలోకి తీసుకొనబడవు. అటువంటి వారు అనర్హులు. నివాస ధ్రువీకరణ పత్రం లోని address, ఖాళీల జాబితా నందు సూచించిన ప్రాంతం ఒకేలా ఉండాలి. ఈ నియామకాలు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ (DHS) ద్వారా జరుగుతాయని తెలిపారు.

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *