SBI Vacancy : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 12,000 ఉద్యోగాలు… ఈ సంవత్సరం భారీ నియామకాలు.
SBI 12,000 Jobs at State Bank Of India Massive Recruitment Drive This Year : నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త.. దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ సేవలను మరింత విస్తరించే ఉద్దేశంతో ఈ సంవత్సరం సుమారుగా 12000 కొత్త ఉద్యోగ నియమకాలు చేపట్టడంతో పాటు దేశవ్యాప్తంగా మరో 250 వరకు కొత్త బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నట్లు ఎస్బిఐ చైర్మన్ చర్ల శ్రీనివాసులు శెట్టి గారు తెలిపారు. ఈ సంవత్సరంలో 11 వేల నుంచి 12 వేల మధ్యలో కొత్త ఉద్యోగ నియామకాలు ప్రణాళికలు ఉన్నాయని ఎస్బిఐ చైర్మన్ సి ఎస్ శెట్టి తెలిపారు.
ఎస్బిఐలో ముఖ్యంగా క్లిరికల్, ఆఫీస్ కేడర్లో ఈ ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బ్యాంకు భవిష్యత్ అనుసరించి ఈ ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం మార్చి కి ఎస్బిఐలో ఉద్యోగుల సంఖ్య 2.5 లక్షల మంది ఉన్నారు. 2026 ఫైనాన్స్ ఇయర్లో 25,633 మందిని నియమించుకుంది.

