AP NTR Bharosa Pension 2026 : ఏపీలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పై కీలక ప్రకటన… కొత్త వారికి పంపిణీ.
Andhra Pradesh September New NTR Bharosa Pension Scheme 2026 Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ పంపిణీ ఇంటి వద్దకు వచ్చే లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్న విజయవంతంగా ముందుకెళుతుంది. కొత్తగా మూడు లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. వచ్చే సెప్టెంబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందజేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ ప్రతి ఒక్క నెల ఒకటో తేదీని పంపిణీ చేస్తున్నారు. కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలో 3 లక్షల మందికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం అధికారికంగా జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ కోసం ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 01 సెప్టెంబర్ నా 61,92,396 మందికి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఒకటి సెప్టెంబర్ న 6265 మందికి కొత్త పెన్షన్ అందిస్తూ ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ద్వారా 01 సెప్టెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 లక్షల మందికి పెన్షన్ దారులకు పెన్షన్ సిద్ధమైనట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. ఇందులో కొత్తగా మంజూరైన 6265 వితంతు బాధ్యతలకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ అందజేయాలని దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.51 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. భాగస్వామి మరణించిన అనంతరం అర్హత కలిగిన జీవిత భాగస్వామికి సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో స్పౌజ్ పింఛన్లను అందిస్తున్నట్లు తెలిపారు. నిరుపేద సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారులకు అందే విధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వారి లక్ష్యమని మంత్రి స్వస్థత చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లకు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.. కూటమి ప్రభుత్వం మరో మూడు లక్షల కొత్త పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమయింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి ముఖ్యంగా వితంతువులు వృద్ధులు దివాంగులు చేనేత కార్మికులకు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో లేదా https://sspensions.ap.gov.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇందుకుగాను అభ్యర్థులు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ తో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అటాచ్ చేయాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ జతపరచవలసినవి :
1. ఆధార్ జిరాక్స్
2. ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
3. క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్
4. ఇన్ కం సర్టిఫికేట్ జిరాక్స్
5. రైస్ కార్డు జిరాక్స్
7. పెన్షన్ రకాన్ని బట్టి సంబందిత పత్రం
6. గడిచిన 6 నెలల కరెంటు బిల్లులు జిరాక్స్

