రాత పరీక్ష లేకుండా 12th అర్హతతో అంగన్వాడి టీచర్ నోటిఫికేషన్ వచ్చేసింది | ICDS Anganwadi Notification 2026 Apply Now
TG ICDS Anganwadi Teacher (AWT) Notification 2026 Apply Now : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ లో ఐసీడీఎస్ ప్రాజెక్టులులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT) పోస్టులను కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని (02) భూపాలపల్లి మరియు మహదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT) పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడినవి. అభ్యర్థులు పూర్తి వివరాల కొరకు https:/wdcw.tg.nic.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
•దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.08.2026
•దరఖాస్తుల చివరి తేదీ: 02.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు.
ముఖ్య నిబంధనలు మరియు అర్హతలు : విద్య అర్హత అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2026 నాటికి అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి/ వార్డ్ (అర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయితీకి (రూరల్) చెందిన స్థానికురాలై ఉండాలి.
ఎంపిక విధానం :: అంగన్వాడీ టీచర్ పోస్టులకు, అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. అంగన్వాడీ టీచర్ పోస్టులకు, అభ్యర్థి పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాది కేంద్రం గ్రామపంచాయితి నివాసి అయి ఉండాలి. ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన ఆంగన్వాడీ టీచర్ పోస్టులకు, అదే గ్రామం/ ఆవాసం/ హాబిటేషన్ నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్సీ వర్గానికి కేటాయించిన ఆంగన్వాడీ టీచర్ పోస్టులకు, ఆదే గ్రామ పంచాయితీలోని ఆవాసల గ్రామాల నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.
ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు.ప్రత్యేక కేటగిరీలు: వితంతుప్తులు 5 మార్కులు. ఆనాదలు- 10 మార్కులు, దివ్యాంగులు 5 మార్కులు. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ- 10 మార్కులు. దరఖాస్తు https://wdcw.tg.nic.in/ వెబ్సైట్ నందు మాత్రమే Apply చేయవలెను. ఈ నోటిఫి కేషన్ను పూర్తిగా రద్దు చేయుటకు లేదా అవసరమైన మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ ఛైర్మన్, జయశంకర్ భూపాలపల్లి వారికి పూర్తి అధికారాలు కలవు. సిడిపిఓ డిడబ్ల్యుఓ ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.

🛑Notification Pdf Click Here
🛑 Vacancy Detail Click Here
🛑 Apply Online Link Click Here

