AP లో రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. మీ మార్టులు ప్రారంభం.. AP Mee Marts low cost rice scheme 2026 Latest News
AP Mee Marts low cost rice scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్లో రేషన్ దారులకు భారీ శుభవార్త తక్కువ ధరలకే బియ్యం పథకాన్ని ప్రారంభించి, మంచి స్పందన వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డి గారు వెల్లడించారు. అలాగే రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు తో తక్కువ ధరతో బియ్యం, కందిపప్పు & పామ్ ఆయిల్ పొందే అవకాశం.

•రేషన్ కార్డు దారులకు భారీ శుభవార్త.
•రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు తో కూడా 10 కిలోల బియ్యం సరఫరా.
•తక్కువ ధరలకే ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
ఏపీలో తక్కువ ధరకే బియ్యం పథకాన్ని ప్రారంభించి దేశంలోని తొలిసారిగా రేషన్ కార్డుదారులకు స్ట్రీమ్ రైస్ పంపిణీ కాకినాడ జిల్లాలో ప్రారంభించారు. రేషన్ షాపులను మీ మార్టు’లుగా మార్చిలో 64 రకాల సరుకులు విక్రయిస్తామని, రాయితీతో కందిపప్పు, పామ్ ఆయిల్ అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ కార్డు తక్కువ ధరకే బియ్యం ఇస్తామని అధికారులు ఆదేశాలు తెలియజేశారు.
తక్కువ ధరకే బియ్యం స్కీం ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 రూపాయలు విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ. 52 కు, రూ. 58 ధర పలికే గ్రేడ్ వన్ రా రైస్ రూ. 50కి అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 రైతు బజార్లు 500 రైస్ మిల్లుల ప్రత్యేకత కౌంటర్లు విక్రయాల కొనసాగుతున్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్క కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం అందచేయనున్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబం పై ఆర్థిక భారాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్షమని ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పరచందన్నారు.


