Indian Air Force : 10+2 అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
Indian Air Force Lower Division Clerk (LDC) Application 2026 latest news : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో గ్రూప్ ‘సి’ ఉద్యోగ నియామకాల కోసం 10+2 అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) గ్రూప్ సి సివిలియన్ పోస్టుల నియామకం కోసం అర్హులైన భారత పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థులు 10+2 పాసై, వయసు 18-25 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగులకు రూ₹19,900/- to రూ₹63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్ష & కంప్యూటర్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును ఇవ్వబడిన తపాలా చిరునామాకు పంపవచ్చు.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 02 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత :
•గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం (నిమిషానికి 35 పదాలు మరియు 30 పదాలు అంటే ప్రతి పదానికి సగటున 5 కీలను నొక్కడం ద్వారా గంటకు 10500 KDPH మరియు గంటకు 9000 KDPH వేగానికి సమానం) [అనుమతించబడిన సమయం 10 నిమిషాలు].
గరిష్ట వయో పరిమితి : వయోపరిమితి: అన్ని పోస్టులకు 18-25 సంవత్సరాలు
•నెల జీతం : పోస్టుకును అనుసరించి రూ₹19,900/- to రూ₹63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో
•ఎంపిక విధానం : రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
•దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థి ఫారాన్ని A-4 సైజు కాగితంపై (రెండు వైపులా) ప్రింట్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
•చిరునామా : Air Officer Commanding Air Force Station, Tezpur, Assam-784104
ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 01 ఆగస్టు 2026
•ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30 ఆగస్టు 2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

