ఏపీలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి అకౌంట్లోకి రూ.25000/-… డేట్ ఫిక్స్.. | AP Netannaku Bharosa scheme 2026 Latest News
AP Netannaku Bharosa Scheme 2026 Release Date : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త.. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆగస్టు 7వ తేదీన ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని అమలు చేయనన్నది. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల మందికి అర్హత ఉన్నట్లు అంచనా. వారి అకౌంట్లో 25000 చొప్పున జమ చేయనున్నారు. అలాగే చేనేత రంగమైన రాట్నం వడకడం, రంగులు అద్దడం తదితర రంగాల్లో కూడా వర్తింప చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతల కార్మికులకు మరొక తీపి కబురు తెలిపారు. జాతీయ చేనేతల దినోత్సవ సందర్భంగా నేతన్నకు భరోసా పథకం అమలు చేయాలని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి చేనేత, జౌళి శాఖ కి శాఖ కసరత్తును చేస్తుంది. వైకాపా సర్కారు హయాంలో ఈ పథకానికి 24000 ఇచ్చారు కానీ ఈ కూటమి ప్రభుత్వం 25000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. చేనేత కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకానికి సంబంధించి కూడిక ప్రభుత్వం 250 కోట్లు కేటాయించారు. ఈ పథకం సొంత మగ్గమున్న చేనేత కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
సొంత మగ్గం ఉండే చేనేత కార్మికుల, కుటుంబంలో ఒకరికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. చేనేత అనుసంధానమైన రాట్నం వడకడం, రంగులు అద్దడం, తదితర రంగాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ రంగానికి చెందిన సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 10000 మంది ఉన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.


