AP POLYCET 2026 Final Counselling Date : ఏపీ పాలీసెట్ 2026 ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
AP POLYCET 2026 Final Counselling Date Release : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ (Commissionerate of Higher Education) APPOLYCET-2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా కమిషనరేట్ ఈనెల 16-07-2026 నుండి 21-07-2026 వరకు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & వెబ్ ఆప్షన్ల నమోదు (Web Options Entry) పూర్తి చేయాలి. పాలీసెట్-2026లో అర్హత సాధించిన విద్యార్థులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా కమిషనరేట్ APPOLYCET-2026 అడ్మిషన్లు డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందాలనుకుంటున్న, APPOLYCET-2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు తెలియజేయునది ఏమనగా, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు మరియు ఆప్షన్లను ఎంచుకోవడం వంటి అంశాలతో కూడిన వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ 16-07-2026 నుండి 21-07-2026 వరకు నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలు మరియు షెడ్యూల్ కోసం, వెబ్సైట్లో ఉంచిన వివరణాత్మక నోటిఫికేషన్ను చూడండి.
మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ నూ https://polycet.ap.gov.in సంప్రదించవచ్చు.

🔥Final counselling notification PDF Click Here
🛑 Official Website Click Here

