Telangana Police Jobs : 7వేల పోలీస్, జైళ్ల & అగ్నిమాపక శాఖ లో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
Telangana Police 7000 vacancies upcoming notification 2026 all details in Telugu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో 5000 ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి స్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తెలంగాణ జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ & స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సె లో మరో 2000 ఖాళీలైతే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో 148 ఎస్సై ( సివిల్స్) ఉద్యోగాలు, 3697 కానిస్టేబుల్ (సివిల్స్) ఉద్యోగాలు & 1052 కానిస్టేబుల్ (ఆర్మ్డ్ రిజర్వ్) తదితర ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా త్వరలో రిలీజ్ చేయనున్నారు.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) : 148
•పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (AR) :: 14
•రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TGSP) : 12
•సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) : 3
•పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (FPB) : 23
•పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) : 3697
•పోలీస్ కానిస్టేబుల్ (AR) : 1052
•పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) : 24
•పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పిటిఓ : 20
•పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పిటిఓ : 07 తదితర ఉద్యోగాలు, మొత్తం ఉద్యోగాలు 5000 ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, హైదరాబాద్ ద్వారా ప్రత్యక్ష నియామకం పద్ధతిలో హైదరాబాద్ పోలీస్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఎస్సై ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ కానిస్టేబుల్ ఉద్యోగులకు సెలెక్ట్ అయితే బేసిక్ శాలరీ నెలకు రూ.16,400/- నుంచి రూ.49,870/- మధ్యలో జీతం ఇస్తారు. ఈ త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ను https://www.tgprb.in/ విజిట్ చేస్తూ ఉండండి.

✅ Telangana Police Jobs Official Update Notice 2026
🛑Official Website Click Here

