No Fee : జిల్లాలో వ్యవసాయ శాఖలో AEO ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Agriculture Officer Agriculture Extension OfficersRecruitment 2026 Apply Now 

No Fee : జిల్లాలో వ్యవసాయ శాఖలో AEO ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Agriculture Officer Agriculture Extension OfficersRecruitment 2026 Apply Now 

TS District Agriculture Recruitment 2026 Latest Agriculture Extension Officers (AEO) Notification 2026 Apply Now: జిల్లా వ్యవసాయ కార్యాలయం లో అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్ (AEO) పోస్టుల నియామకం కోసం అర్హులైన భారత పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 01.07.2026, సాయంత్రం 5.00 గంటలు లోపు అప్లై చేయాలి.

జిల్లా వ్యవసాయ కార్యాలయం క్రింద అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOS) పోస్టుల కొరకు నోటిఫికేషన్ నెం-02/2026-రిక్రూట్‌మెంట్-నోటిఫికేషన్-ఉద్యోగ ప్రకటనను జనగావ్ జిల్లా వెబ్‌సైట్‌లో 24/06/2026న విడుదల చేయాలి. బి.ఎస్.సి.(వ్యవసాయం), వ్యవసాయంలో డిప్లొమా/విత్తన సాంకేతికతలో డిప్లొమా పాసైన వారు అర్హులు. 18-46 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ₹రూ. 22,750/- నెల జీతం ఇస్తారు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ ప్రారంభం 25.06.2026 నుండి 01.07.2026 సాయంత్రం 05:30 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు.

పోస్టు మరియు ఖాళీ వివరాలు

ఈ నోటిఫికేషన్ లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారులు-(03) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయిపోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి బి.ఎస్.సి.(వ్యవసాయం) లేదా వ్యవసాయంలో డిప్లొమా/విత్తన సాంకేతికతలో డిప్లొమా.

గరిష్ట వయో పరిమితి : కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిని లెక్కించడానికి ఈ క్రింది సడలింపులు అనుమతించబడ్డాయి, కనిష్ఠ మరియు గరిష్ట వయస్సును 01.07.2025 నాటికి లెక్కించాలి:

(ఎ) ఎస్.సి., ఎస్.టి., బి.సి. మరియు ఇ.డబ్ల్యూ.ఎస్. లకు (05) సంవత్సరాల సడలింపు.

(బి) మాజీ సైనికులకు (3) సంవత్సరాల సడలింపు.

(సి) ఎన్‌సిసిలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన వారికి (3) సంవత్సరాల సడలింపు మరియు ఎన్‌సిసిలో సర్వీసు కాలం

(డి) శారీరకంగా వికలాంగులకు 10 (పది) సంవత్సరాల సడలింపు.

నెల జీతం : పోస్టుకును అనుసరించి రూ. 22,750/- నెల జీతం ఇస్తారు. నోటిఫై చేయబడిన పోస్టులు శాశ్వత/రెగ్యులర్ ప్రభుత్వ పోస్టులు కావు మరియు పూర్తిగా తాత్కాలికమైనవి.

అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ https://jangaon.telangana.gov.in/) లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన జిల్లా అవుట్‌సోర్సింగ్ కమిటీ ద్వారా నియామకాలు జరుగుతాయి.

ఎంపిక విధానం : రాత పరీక్ష నిర్వహించబడుతుంది. 80% రాత పరీక్ష మరియు 20% మెరిట్ (10వ తరగతి 5%, 12వ తరగతి 5%, గ్రాడ్యుయేషన్/డిప్లొమా 10%) ఆధారంగా తుది మెరిట్ జాబితాను తయారు చేసి, పారదర్శకత కోసం మరియు అభ్యంతరాలను స్వీకరించడం కోసం జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.

దరఖాస్తు రుసుము : దరఖాస్తు & ప్రాసెసింగ్ ఫీజు వసూలు: రూ. ఏమీ లేదు.

ఎలా దరఖాస్తు చేయాలి:

దరఖాస్తు ఫారాలు మరియు సూచనలను జనగాం జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూరించిన దరఖాస్తు ఫారాన్ని అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న జనగాం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి స్వయంగా (లేదా) రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. గడువు తేదీ తర్వాత అందిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి. తపాలా ఆలస్యాలకు జిల్లా ఎంపిక కమిటీ బాధ్యత వహించదు. జతపరచవలసిన సర్టిఫికేట్లు (అటెస్టెడ్ కాపీలు) :

* ఎ) విద్యా అర్హత సర్టిఫికేట్

* బి) స్టడీ సర్టిఫికేట్

* సి) కుల సర్టిఫికేట్

* డి) వికలాంగుల (P.H.C) సర్టిఫికేట్

పైన తెలిపిన వివరాలు అన్నియు నిజమని మరియు నిరూపించడమైనది. సంయుక్త నియమక నిబంధనలకు లోబడి నేను ఇచ్చిన సమాచారము అసత్యమని నిరూపితమైనచో నా నియామకమును రద్దు చేయుటకు నేను సమ్మతించుచున్నాను. డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును అభ్యర్థులు పూరించి, అవసరమైన సర్టిఫికెట్ల నకళ్లను జతచేసి, జనగాం జిల్లాలోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ జారీ : 24/06/2026

దరఖాస్తులు స్వీకరించిన తేదీ : 25/06/2026 నుండి 01/07/2026 వరకు

రాత పరీక్ష : 02/07/2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *