10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ‘సి’ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Group ‘C’ Civilian MTS Recruitment 2026 Apply Now
Latest Indian Air Force Group ‘C’ Civilian MTSRecruitment 2026 Latest IAF MTS Notification 2026 Apply Now: భారతీయ వాయుసేన /ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గ్రూప్ ‘సి’ పౌర పోస్టుల నియామకం కోసం అర్హులైన భారత పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లికేషన్ ప్రారంభం తేదీ 27.06.2026 నుండి 26.07.2026 సాయంత్రం 05:30 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును కింద ఇవ్వబడిన తపాలా చిరునామాకు పంపవచ్చు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో గ్రూప్ ‘సి’ సివిలియన్ మల్టీ టాస్క్ స్టాప్ (MTS) ఉద్యోగుల కోసం కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10th పాసైన వారు అర్హులు. 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. జీతం రూ.₹18,000/- to ₹56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ Employment News 27 June – 3 July 2026 లో పేజీ no 14 లో పబ్లిష్ అయింది. అప్లికేషన్ ప్రారంభం 27.06.2026 నుండి 26.07.2026 సాయంత్రం 05:30 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును ఇవ్వబడిన తపాలా చిరునామాకు పంపవచ్చు.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఈ నోటిఫికేషన్ లో మల్టీ టాస్క్ స్టాప్ (MTS) పోస్టులు ఉన్నాయి. మొత్తం 06 నియామకం ఉన్నాయి.
విద్యా అర్హత :
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత. కావలసిన అర్హత: ఏదైనా సంస్థ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి వాచ్‌మ్యాన్ లేదా లస్కార్ లేదా గెస్టెట్నర్ ఆపరేటర్ లేదా తోటమాలిగా ఒక సంవత్సరం అనుభవం.
గరిష్ట వయో పరిమితి : -అన్ని పోస్టులకు 18-25 సంవత్సరాలు (వయోపరిమితిని నిర్ధారించడానికి కీలకమైన తేదీ దరఖాస్తు స్వీకరించే చివరి తేదీ).
వయో సడలింపు: –
• ఓబీసీ వర్గానికి చెందిన అభ్యర్థులకు 03 సంవత్సరాలు.
• ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు 05 సంవత్సరాలు
• శారీరక వికలాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు. (ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన శారీరక వికలాంగులకు అదనంగా 05 సంవత్సరాలు మరియు ఓబీసీ వర్గానికి 03 సంవత్సరాలు.
•నెల జీతం : పోస్టుకును అనుసరించి MTS పోస్టుకు రూ.₹18,000/- to ₹56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ www.employmentnews.gov.in/) లో
•ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ రాత పరీక్ష కనీస విద్యా అర్హత ఆధారంగా ఉంటుంది.
•దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును ఇవ్వబడిన తపాలా చిరునామాకు పంపవచ్చు. పోస్టుల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (దరఖాస్తు ఫారంలో అతికించినవే).
చిరునామా :
Commandant,
IAM, IAF
Vimanapura PO
Bangalore-560017
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ : 27.06.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 26.07.2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

