AP Polycet Exams Results 2026 Release Date : ఏపీలో పాలిటెక్నిక్ 2026 ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే?
AP Polycet Exams Results 2026 Release Date : రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి (SBTET), ఆంధ్రప్రదేశ్, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)-2026 ప్రవేశ పరీక్ష ఈనెల 25వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసినదే. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,63,008 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ కూడా విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో 2026 27 సంవత్సరాల సంబంధించి డిప్లమో కోర్స్ ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)-2026 ను 25-04-2026 (శనివారం) రోజున ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కి కూడా తాజాగా విడుదల చేశారు. ఫలితాలు మే 5వ తేదీన వెల్లడించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య శాఖ మండలి ఏర్పాటు చేస్తున్నారు.
అభ్యర్థులు తమ POLYCET ఫలితాలు క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
1. వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra): అభ్యర్థులు 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి ఫలితాల PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది విదంగా వెళ్లాలి:
Education Services → POLYCET Entrance Results
తర్వాత క్రింది వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి:
a) SSC హాల్ టికెట్ నంబర్
b) నమోదు చేసిన మొబైల్ నంబర్
2. అధికారిక వెబ్సైట్: POLYCET ఫలితాల కోసం క్రింది వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
SSC హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు చేసిన మొబైల్ నంబర్ నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.
🛑AP Polycet Exams Results 2026


