AP 10th Class Advanced Supplementary Examinations May 2026 Time Table Release | ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
AP 10th Class Advanced Supplementary Examinations May 2026 Time Table Release : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ ప్రభుత్వ పరీక్ష విభాగం గురువారం విడుదల చేశారు. 25 మే నుంచి 04 జూన్ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 85.25% ఉత్తీర్ణత నమోదయింది. 2026 సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 6,18,131 లక్షల మంది పరీక్ష రాయగా 5,26,954 మంది విద్యార్థులు పాసయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 4.11% పాస్ పర్సంటేజ్ అధికంగా వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ సెకండరీ విద్యా బోర్డు, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మే-2026 అకడమిక్ మరియు OSSC అభ్యర్థుల పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేశారు. AP అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 25.05.2026 సోమవారం ప్రారంభమై 04.06.2026 గురువారం వరకు పరీక్షలు జరుగుతాయి. సమయము ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సెకండరీ విద్యా బోర్డు పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఎగ్జామినేషన్ ఫీజు మే ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు చెల్లించవలసి వస్తుందని తెలిపారు. 50 రూపాయలు లేటు ఫీజుతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు రీకౌంటింగ్ కొరకు 500 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్టుకు చెల్లించవలసి ఉంటుంది. అలాగే రి వెరిఫికేషన్ కోసం అభ్యర్థులకు ఒక్కొక్క సబ్జెక్టుకు ₹1000 చెల్లించవలసి ఉంటుంది. రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కొరకు మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకుని అవకాశం కల్పిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం https://bse.ap.gov.in/ వెబ్సైట్ ని సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా షెడ్యూల్ వివరాలు
25.05.2026 సోమవారం – మొదటి భాష (గ్రూప్-ఎ)
26.05.2026 మంగళవారం – రెండవ భాష
28.05.2026 గురువారం – ఇంగ్లీష్
29.05.2026 శుక్రవారం – గణితం
30.05.2026 శనివారం – ఫిజికల్ సైన్స్
01.06.2026 సోమవారం – జీవ శాస్త్రం
02.06.2026 మంగళవారం – సామాజిక అధ్యయనాలు
03.06.2026 బుధవారం – మొదటి భాష పేపర్-11 (కాంపోజిట్ కోర్సు)
04.06.2026 గురువారం – OSSC ప్రధాన భాషా పేపర్-II (సంస్కృతం, అరబిక్, పర్షియన్)

పైన పేర్కొన్న ఏ తేదీ/తేదీలకైనా ప్రభుత్వం ప్రభుత్వ సెలవు దినం లేదా సాధారణ సెలవు దినం ప్రకటించినప్పటికీ, మే 2026లో జరిగే 2 ఎస్.ఎస్.సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు పైన పేర్కొన్న టైమ్ టేబుల్ ప్రకారమే ఖచ్చితంగా నిర్వహించబడతాయి.
🛑 Official Website Click Here


