ఆధార్ కార్డు ఉంటే ప్రతి నెల మీ అకౌంట్ కి 3000.. కేవలం 55 రూపాయలు చెల్లిస్తే చాలు.. అర్హతలు మరిన్ని వివరాలు
PM Kisan Maandhan Yojana scheme 2026 all details in Telugu : కేంద్ర ప్రభుత్వం నుంచిప్రతినెల 3000 పెన్షన్ పొందాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువస్తూ ఉంటుంది అందులో చాలామందికి తెలియని ఒక కొత్త PM Kisan Maandhan Yojana పథకం గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి నెలకు 55 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలకు 3000 పెన్షన్ పొందవచ్చు. అది కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమవుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకం అమలు చేసింది అందులో భాగంగా గృహ సహాయక లకు, వీధి వ్యాపారులకు, భవన నిర్మాణ కార్మికులకు & సన్న కారు రైతుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ పథకాన్ని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క నెల మూడు వేల పెన్షన్ అందిస్తారు. ఈ పథకంలో మీకు చేరాలనుకున్న అభ్యర్థులు ఎందులో ముందుగా మీరు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క నెల కూడా మీకు పెన్షన్ వస్తుంది. అది కూడా కొంత మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు
•వయస్సు 18 సంవత్సరాలు నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•నెలసరి ఆదాయము రూ.15,000/- కన్నా తక్కువే ఉండాలి.
•Employees’ Provident Fund (EPF), SPS వంటి సౌకర్యం ఉండకూడదు.
ప్రీమియం ఎంత చెల్లించాలి
అభ్యర్థి వయస్సు మీరు రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ పొందాలి అనుకున్న దాని పైనబట్టి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. కానీ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది మీరు 18 సంవత్సరాల చేరితే నెలకు 55 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ అందులో చేరే ప్రీమియం కూడా ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. ఇంక వయసు 60 సంవత్సరాలు వచ్చే అంతవరకు అదే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. 20 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల 3000 పెన్షన్ అందిస్తారు. ఒకవేళ పెన్షన్ దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి 50% పెంచిన అందిస్తుంది అంటే ప్రతి నెల 1500 వరకు జీవిత భాగస్వామికి దొరుకుతుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా
ఈ పథకం చీరాలనుకున్న అభ్యర్థులు చాలా సులువుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు గాను అభ్యర్థి ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలతో మీసేవ CSC కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపుగా 52.5 లక్షల మంది స్కీమ్ లో చేరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకుండా కుటుంబం ఆర్థిక భరోసా కూడా పొందుతారు. తప్పనిసరిగా అర్హులైతే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.

