India Post GDS 2nd Merit List 2026 Live Check State Wise Merit List All Details In Telugu
India post GDS 2nd merit list 2026 :: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2026 షెడ్యూల్ 1 జనవరి కోసం 2nd మెరిట్ లిస్టు మర్చి 28 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నియామక డ్రైవ్ లో భారతదేశం అంతటా 28,636 గ్రామీణ డాగ్ సేవకు (GDS) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పూర్తిగా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ 10వ తరగతి విద్య అర్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2026 కోసం దాదాపు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ రిక్రూమెంట్ లో 28,636 ఖాళీల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగులలో ఆంధ్రప్రదేశ్ లో 1060 ఉద్యోగాలు, తెలంగాణలో 608 ఉద్యోగాలు ఖాళీలైతే ఉన్నాయి. ఇందులో 1st మెరిట్ లిస్టులో 1048 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో 607 ఉద్యోగాలు తెలంగాణలో 1st మెరిట్ లిస్టులో అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. గ్రామీణ డాగ్ సేవకు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికార వెబ్సైట్ లో https://indiapost.gov.in/gdsonlineengagement సర్కిల్ వారీగా జాబితా ద్వారా తెలుసుకోవచ్చు.

మొదటి మెరిట్ లిస్ట్ జాబితా ఇండియా పోస్టల్ GDS 2026, మార్చి 6న విడుదల చేసింది. అలాగే మార్చి 23 వరకు ఈ 1st మెరిట్ లిస్ట్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ జాబితా డౌన్లోడ్ లింక్
ఇండియా పోస్ట్ జిడిఎస్ గ్రామీణ డాగ్ సేవకు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కోసం సర్కిల్ వారీగా మెరిట్ జాబితా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో 2nd మెరిట్ లిస్ట్ జాబితా PDF డౌన్లోడ్ చేసుకుని అవకాశం అభ్యర్థులకు కల్పిస్తారు.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా డౌన్లోడ్ చేసుకునే విధానం
ఇండియా పోస్ట్ జిడిఎస్ రిక్రూమెంట్ 2026 రెండవ మెరిట్ జాబితా త్వరలో విడుదల కానున్నది. అది ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం
1.ముందుగా అభ్యర్థులు https://indiapost.gov.in/gdsonlineengagement అనే అధికార వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
2.హోం పేజ్ లో GDS షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల విభాగమని ఆప్షన్ ని క్లిక్ చేయండి.
3.ఇప్పుడు అభ్యర్థి రాష్ట్రము లేదా సర్కిల్ ని ఎంచుకోండి.
4.మెరిట్ జాబితా మీ స్క్రీన్ పైన పిడిఎఫ్ రూపంలో కనపడుతుంది. అందులో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
GDS 2nd మెరిట్ లిస్ట్ జాబితా ఎన్ని రోజులు తర్వాత వస్తుంది
GDS ఫలితాలు 1st మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 23 మర్చి లాస్ట్ తేదీ నుంచి 13 రోజుల నుంచి 15 రోజులు మధ్యలో సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అలా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నాలుగో తేదీ ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత మీకు సెకండ్ మెరిట్ లిస్టు విడుదలవుతుంది.


