AP 10th Class Exam 2026 : విద్యార్థులకు అలర్ట్.. రేపు 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా..
AP SSC, Inter Exam 2026 Postpone : ఆంధ్రప్రదేశ్ లో 21.03.2026న జరగాల్సిన SSC 3వ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షను 02.04.2026కు వాయిదా వేయడం జరిగింది. అలాగే ఇంటర్ పరీక్షలు కూడా రంజాన్ పండుగ కారణంగా ఈనెల 21వ తేదీన సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థులకు ఈ తేదీ తప్పనిసరిగా గమనించండి.

ఆంధ్రప్రదేశ్ లో 21.03.2026న జరగాల్సిన ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం IPE (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I & లాజిక్ పేపర్-I) 📝 పరీక్ష ఇప్పుడు 25.03.2026 (బుధవారం)న జరుగుతుంది. రంజాన్ పండుగ కారణంగా వాటిని ఈనెల 25వ తేదీన వాయిదా వేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. అలాగే పదో తరగతి 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్ష కూడా రేపు జరగవలసి ఉండేది దాన్ని కూడా ఏప్రిల్ రెండో తేదీన మారుస్తున్నట్లు మంత్రిగారు Twitter చేశారు. ఈ రెండు పరీక్షలు రాసిన విద్యార్థులు కొత్త తేదీని దృష్టిలో తప్పనిసరిగా తీసుకోవాలి. మిగిలిన పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ఇచ్చిన ప్రకారంగానే జరగనున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి 16న ప్రారంభం అయ్యాయి. ఈ సంవత్సరంలో 6.40 లక్షల విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి. అలాగే మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. వచ్చేనెల ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.


