RRB NTPC Station Master Jobs 2026 : విద్యార్థులకు అలర్ట్.. రైల్వే రాత CBT 1 పరీక్ష సిటీ ఇంటిమేషన్ వచ్చేసాయి! డైరెక్ట్ లింక్ ఇదే..
RRB NTPC Station Master Jobs 2026 : దేశవ్యాప్తంగా RRB NTPC రైల్వే శాఖ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గ్రాడ్యుయేషన్ లెవెల్ 2025 CBT 1 పరీక్షకు సంబంధించి అప్డేట్ విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం RRB NTPC అఫిషియల్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ లో RRB NTPC గ్రాడ్యుయేషన్ లెవెల్ 2025 సి బి టి 1 పరీక్షకు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) కొత్త నోటీసు విడుదల చేసింది. సి బి టి పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలు వెబ్సైట్లో ఎంటర్ చేసి, తమ పరీక్ష కేంద్రాలను, తేదీ, టైము పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఆర్ఆర్బీ పరీక్షా షెడ్యూలు కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. RRB NTPC నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రాడ్యుయేట్) పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) కోసం మార్చి 16 నుంచి మార్చి 27 లోపల మధ్యలో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో 5810 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఉద్యోగ వివరాలు చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రోజుకు మూడు షిప్పుల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
RRB NTPC చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మొదటి సిప్టు ఉదయం 9 గంటలకు రెండో స్విఫ్ట్ మధ్యాహ్నం 12:45 గంటలకు మూడో షిఫ్టు సాయంత్రం 4:30 మధ్యలో ఉన్న ఉంటాయి. RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ సిటీ ఇంటిమేషన్ వాళ్లకి ఇచ్చిన టైమింగ్ లో గంట ముందు పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి. అలాగే అభ్యర్థి హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు & పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డు తీసుకొని పోవాలి. అలాగే పరీక్ష కన్నా కార్డు విడుదల కావడం జరుగుతుంది.
పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు అభ్యర్థుల ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పరీక్షా కేంద్రంలో జరుగుతుంది. అభ్యర్థులు వారి అసలు ఆధార్ కార్డు లేదా ఇ-వెరిఫైడ్ ఆధార్ ప్రింటవుట్ తీసుకురావాలి. అభ్యర్థులు ఆధార్ వెరిఫికేషన్ ద్వారా తమ గుర్తింపును ప్రామాణీకరించాలని సూచించారు, ఇదివరకే చేయకపోతే, www.rrbapply.gov.in లో వారి ఆధారాలతో లాగిన్ అవ్వడం ద్వారా పరీక్షా కేంద్రంలోకి సజావుగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. RRB ఎంపికలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా జరుగుతాయి మరియు నియామకాలు అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మాత్రమే జరుగుతాయి.


