Food డిపార్ట్మెంట్ లో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | CWC Recruitment 2025 Apply Online
CWC Recruitment 2025 Latest Junior Personal Assistant & Junior Executive Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. చక్కటి అవకాశం సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం..ఆహార & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం అర్హత, అనుభవం, వయస్సు మొదలైన అర్హత కలిగిన అభ్యర్థుల నుండి (పురుష/స్త్రీ/ట్రాన్స్‌జెండర్) www.cewacor.nic.in/ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ & డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థుల నుండి CWC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ 17 అక్టోబర్ 2025 & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 16 నవంబర్ 2025. అర్హత (16.11.2025 నాటికి) వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు. నెల జీతం ₹29,000-93,000/- మధ్యలో ఇస్తారు. అర్హత గల దరఖాస్తుదారులు CWC వెబ్‌సైట్ https://cwceportal.com/careers ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.

Central Warehousing Corporation (CWC) నోటిఫికేషన్ వయసు, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC)లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 28 సం||రాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 22
అర్హత :: డిగ్రీ & డిప్లమా పాస్ చాలు
నెల జీతం :: రూ.₹29,000/-₹93,000/-
దరఖాస్తు ప్రారంభం :: 17 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 16 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://cwceportal.com/careers
»పోస్టుల వివరాలు: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత : 15.11.2025 నాటికి,
•జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ మరియు సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో కనీసం ఒక సంవత్సరం కోర్సు/తత్సమానం. ఇంగ్లీషులో నిమిషానికి 80 పదాలు మరియు ఇంగ్లీషు టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల షార్ట్‌హ్యాండ్ వేగం. కావాల్సినవి: హిందీలో షార్ట్ హ్యాండ్/టైపింగ్‌లో ప్రావీణ్యం
•జూనియర్ ఎగ్జిక్యూటివ్ : ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీని ఒక ఐచ్చిక సబ్జెక్టుగా మరియు ఇంగ్లీషును ఒక ప్రధాన సబ్జెక్టుగా తీసుకొని గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా హిందీలో బి.ఎ.కి సమానమైన డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. కావాల్సినది: హిందీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లతో పనిచేయడంలో నైపుణ్యం.

»వయోపరిమితి: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ (16.11.2025 నాటికి) 28 సంవత్సరాలు (అంటే అభ్యర్థులు 16.11.1997 కంటే ముందు మరియు 15.11.2007 తర్వాత జన్మించి ఉండకూడదు.


»వేతనం : పోస్టును అనుసరించి ₹29,000/-₹93,000/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: SC, ST, PwBD, మాజీ సైనికుడు మరియు మహిళా అభ్యర్థులు రూ. 500/- & అన్‌రిజర్వ్డ్ (UR)/ EWS మరియు OBC వర్గానికి చెందిన ఇతర అభ్యర్థులు రూ. 1,350/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

»ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + స్కిల్ టెస్ట్ (టైపింగ్ & స్టెనోగ్రఫీ) + డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా CWC ఎలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు ముందుగా CWC వెబ్‌సైట్ www.cewacor.nic.in కు వెళ్లి “కెరీర్ @CWC (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్)-2025” లింక్‌పై క్లిక్ చేసి, ఆపై ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవడానికి “క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఫర్ అడ్వర్టైజ్‌మెంట్ నెం. 2025/01” ఎంపికపై క్లిక్ చేయాలి. దరఖాస్తును నమోదు చేసుకోవడానికి, “క్రొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి” అనే ట్యాబ్‌ను ఎంచుకుని, పేరు, సంప్రదింపు వివరాలు మరియు ఇమెయిల్-ఐడిని నమోదు చేయండి. అభ్యర్థులు 17.10.2025 నుండి 15.11.2025 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇతర దరఖాస్తు విధానాలు ఆమోదించబడవు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తు – ప్రారంభ తేదీ: 17.10.2025.
•ఆన్‌లైన్ దరఖాస్తు – ముగింపు తేదీ : 16.11.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

