Anganwadi Jobs : కొత్త గా 4687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
AP Anganwadi helper 4687 job notification 2025 latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ ఆంగన్వాడీ కేంద్రాలను మెయిన్ ఆంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ అప్‌గ్రేడ్ కారణంగా, కొత్తగా 4,687 మంది సహాయకుల నియామకానికి WCDA&SCS శాఖ అనుమతి – ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
ప్రభుత్వం జి.ఓ 4లో 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన 4,687 మంది మినీ అంగన్‌వాడీ టీచర్, ప్రధాన అంగన్‌వాడీ టీచర్ గా అప్‌గ్రేడ్ చేసింది, తద్వారా 4,687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసింది.
ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా పనిచేస్తున్న అప్‌గ్రేడ్ చేయబడిన మినీ అంగన్‌వాడీ కేంద్రాలలో అవసరమైన 4,687 మంది సహాయకులను నియమించుకోవడానికి ప్రభుత్వం ఇందుమూలంగా అనుమతి ఇస్తుంది. త్వరలో ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది దానికి సంబంధించి ఉంటే అర్హతలు సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

4,687 అంగన్‌వాడీ ఆయా ఉద్యోగాలకు అర్హతలు :
1. అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.
2. అభ్యర్థులు వివాహితులు అయిన స్థానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామములో స్థానికులు అయి ఉండవలెను.
3. 01.07.2025 నాటికీ దరఖాస్తుచేయు అభ్యర్థుల వయస్సు 21 సం.లు. నుండి 35 సం.లు లోపల వారు అయి యుండవలెను.
4.యస్.సి. మరియు యస్.టి. ప్రాంతములలో గల యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.
5. అంగన్వాడి కార్య కర్త /అంగన్వాడి సహాయకురాలు పోస్ట్ కొరకు యస్.సి. మరియు యస్.టి. హాబిటేషన్స్ నందు యస్.సి. మరియు యస్.టి. అభ్యర్తులు మాత్రమే అర్హులు.
గౌరవ వేతనం
అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్లించబడును. ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ.11500/-నెలకు, మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.7000/- నెలకుమరియు అంగన్వాడీ హెల్పెర్ గౌరవ వేతనం: రూ.7000/- నెలకు జి.ఓ. ఏం. ఎస్.నెం.13 WCD&SC (PROGS) తేది: 26.06.2019 ప్రకారం చెల్లించబడును.
జతపరచవలసినవి
1. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం (యస్.సి/యస్.టి/బి.సి. అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచవలయును.
2. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి./ స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రుటిని సమయములో సిడిపిఒ ఎటువంటి అవకతవకలుకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.
3.కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను ఏదేని గెజిటెడ్ అధికారి చే ధృవీకరణ చేసినవి జతపరచవలయును.
4. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటో ను ముందు భాగములో అతికించి, ఫోటో ఏదేని గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేయవలయును.
5. దరఖాస్తులను స్వయముగా సమర్పించవచ్చు మరియు తపాలా ద్వారా కూడా సమర్పించవచ్చు,
6. పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము మరియు మార్పు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.

నియామక పద్ధతి
1) జిల్లా కలెక్టర్/చైర్పర్సన్ జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్
2) సంబంధిత రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ సభ్యులు
3) జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్/అదనపు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ సభ్యులు
4) సి.డి.పి.ఓ. సంబంధిత సభ్యులు
5) పథక సంచాలకులు, జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ- సభ్యులు- కన్వీనర్
పారామీటర్లు/ప్రమాణాలు
1.10 వ తరగతి ఉత్తీర్ణులైతే : 50 మార్క్స్
2. (ప్రీ-స్కూల్ (ట్రైనింగ్/ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా క్రెచి & ప్రీ స్కూల్ మనేజెమెంట్ ట్రైనింగ్/ఇ.సి.ఇ వర్కర్ : 5 మార్క్స్
3. వితంతువు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువు : 5,5 మార్క్స్
4. అనాధ అయిన అభ్యర్థి., ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలో/బాల సదన్ చదివి ఉంటే : 10 మార్క్స్
5. విభిన్న సామర్థ్యం ఉన్న అభ్యర్థులు : 5 మార్క్స్
6. ఓరల్ ఇంటర్వ్యూ : 20 మార్క్స్

🛑Application Pdf Click Here