Anganwadi Jobs : గ్రామీణ అంగన్వాడి కేంద్రాల్లో టీచర్, హెల్పర్ పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తు
Anganwadi Job Notification : అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన కేంద్రాలు, 3,989 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై పరిశీలన జరుగుతోంది. సెంటర్ వారీగా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల సంఖ్యను సేకరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనుమతులు వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను మరింత మెరుగుపరచడంలో కీలకంగా మారుతుంది.
అంగన్వాడి టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగులకు కేవలం పదోతరగతి పాసై ఉండాలి, వివాహమైన మహిళలు అప్లై చేసుకోవచ్చు. స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వయసు 21వ సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలని అభ్యర్థులకి పదో తరగతి మార్కులు లిస్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కుల దృవీకరణ పత్రం, వికలాంగులు అయితే వికలాంగుల ధ్రువీకరణ పత్రం, భర్త మరణించినట్లయితే భర్త మరణించిన సర్టిఫికెట్, అనాధ అయితే అనాధకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ పై చెప్పినా అన్ని డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర రెడీగా ఉండాలి. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. వస్తానే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ & టెలిగ్రామ్ అకౌంట్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🛑Notification Pdf Click Here