Ap గ్రామ సచివాలయంలో కొత్తగా 297 పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల | AP Grama Sachivalayam Notification 2024 Apply Now
Andhra Pradesh Gram Sachivalaya Animal Husbandry Notification : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. పశుసంవర్థక శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఈ నియామక ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మరియు రైతుల అవసరాలకు తగిన సేవలను అందించడానికి చేపడుతున్నారు.
ఈ నియామక ప్రక్రియలో పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మాత్రమే అవకాశం కల్పించారు. అభ్యర్థులు విద్యార్హతలతో పాటు వయోపరిమితి, ఇతర నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలి.
సంస్థ పేరు : పశుసంవర్థక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో పని చేసే విభాగం.
పోస్ట్ పేరు : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
భర్తీ చేస్తున్న పోస్టులు మొత్తం 297 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు : అభ్యర్థులు పశుసంవర్థక శాస్త్రం (వెటర్నరీ సైన్స్) మరియు యానిమల్ హస్బెండరీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. ప్రాధాన్యత మైక్రోబయాలజీ, పాథాలజీ, పారాసిటాలజీ వంటి స్పెషలైజేషన్‌లో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత
నెల జీతం
ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధేశించిన జీతభత్యాలు వర్తిస్తాయి.
వయోపరిమితి
ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
సాధారణ : 18-42 సంవత్సరాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు
దరఖాస్తు విధానం
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అన్ని అవసరమైన పత్రాలను జతచేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
దరఖాస్తు రుసుము
అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాలి. రుసుము చెల్లింపు పద్ధతులు ఆన్‌లైన్ లేదా బ్యాంకు చలాన్ రూపంలో ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులను ఎంపిక చేయడానికి రెండు దశల పరీక్షలు ఉంటాయి.
• రాత పరీక్ష
• సర్టిఫికేట్ వెరిఫికేషన
ముఖ్యమైన తేదీ వివరాలు
దరఖాస్తు ప్రారంభం: అధికారిక నోటిఫికేషన్ విడుదల తర్వాత తేదీ తెలియజేస్తారు.
దరఖాస్తు చివరి తేదీ: నోటిఫికేషన్‌లో పేర్కొంటారు.
🛑Notification Pdf Click Here
తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం
ఈ పోస్టులకు ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కనీస విద్యార్హత ఏది?
కనీసం వెటర్నరీ సైన్స్ & యానిమల్ హస్బెండరీలో బ్యాచిలర్ డిగ్రీ అవసరం.
వయోపరిమితి ఎంత?
వయోపరిమితి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక దశలు ఎంత?
రాత పరీక్ష మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశల ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఎక్కడ దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.