Ayah Jobs : No Fee, No Exam 7th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖలో ఆయా & హౌస్ కీపర్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh DCPU & SAA district wise housekeeper account Aayh job notification in Telugu | Telugu Jobs Point
Andhra Pradesh DCPU & SAA district wise Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త అంగన్వాడి స్థాయిలో ఆయా ఉద్యోగాలు విడుదల.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, నరసరావుపేట, పల్నాడు జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉండగా, ఆయా ఖాళీలను జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (DCPU), స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), మరియు చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్లలో భర్తీ చేయనున్నారు.
సంస్థ పేరు: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం
ముఖ్య బాధ్యతలు: బాలల సంక్షేమం, సంరక్షణ, మరియు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ.
ఖాళీల వివరాలు : DCPU & SAAనోటిఫికేషన్ ప్రకారం మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి వివరాలు:
పోస్ట్ పేరు : అకౌంటెంట్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), హౌస్ కీపర్ & ఆయా
అర్హతలు
అకౌంటెంట్ : కామర్స్/గణితంలో డిగ్రీ; కంప్యూటర్ జ్ఞానం, టాలీలో అనుభవం కనీసం 1 సంవత్సరం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
సోషల్ వర్కర్ : సోషల్ వర్క్/Sociology/Social Sciencesలో డిగ్రీ సంబంధిత రంగంలో అనుభవం
అవుట్ రీచ్ వర్కర్ : 12వ తరగతి ఉత్తీర్ణత; మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు
ఆయా ఉద్యోగులు : 7వ తరగతి పాస్/ఫెయిల్, పిల్లల సంరక్షణలో అనుభవం ఉండాలి. కనీసం 6 సంవత్సరాల అనుభవం
హౌస్ కీపర్ : 10వ తరగతి పాస్/ఫెయిల్; హౌస్ కీపింగ్ డిప్లొమా ఉంటే మంచిది 3 సంవత్సరాల అనుభవం
వయోపరిమితి
• అకౌంటెంట్ :: 23 సం. to 42 సం.
• సోషల్ వర్కర్ :: 23 సం. to 42 సం.
• అవుట్ రీచ్ వర్కర్ :: 18 సం. to 42 సం.
• ఆయా ఉద్యోగులు :: 25 సం. to 42 సం.
• హౌస్ కీపర్ :: 18 సం. to 42 సం.
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• విద్యార్హతల సర్టిఫికెట్లు
• అనుభవం సంబంధిత ధ్రువపత్రాలు
• వయస్సు ధ్రువీకరణ పత్రం
• ఆధార్ కార్డు లేదా గుర్తింపు పత్రం
• ఫోటో పాస్‌పోర్ట్ సైజు (2)
• టాలీ లేదా కంప్యూటర్ నైపుణ్యాలకు సంబంధించిన సర్టిఫికెట్ (అకౌంటెంట్ పోస్టులకు)
దరఖాస్తు విధానం
• అధికారిక వెబ్సైట్ (palnadu.ap.gov.in లేదా wdcw.ap.gov.in) నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
• ఫారమ్‌ను పూర్తిగా పూరించి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు జత చేయాలి.
• దరఖాస్తు పత్రాలను పోస్టు ద్వారా లేదా ప్రత్యక్షంగా సమర్పించాలి.
చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి,
దాకిరాల మిట్ట, బరంపేట, నరసరావుపేట,
పల్నాడు జిల్లా, పిన్ కోడ్: 522601
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
• దరఖాస్తు ముగింపు తేదీ: 02.12.2024 (సాయంత్రం 5.00 గంటల లోపు)
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉటుంది, అన్ని జిల్లాల వల్ల అప్లై చేసుకోవచ్చు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ దరఖాస్తులను సమర్పించవలసిందిగా కోరుచున్నారు.