ASHA Worker, Jobs Mela, Anganwadi Teacher Job Recruitment in Telugu
➡️ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు డీపీఆర్వో, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ
సాక్షి , అమరావతి : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గురు వారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులు 6, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ( డీపీఆర్వో ) పోస్టులు నాలుగు భర్తీ చేయడానికి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులకు అక్టోబర్ 22 నుంచి నవం బర్ 12 వరకు, డీపీఆర్వో పోస్టులకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు.
✅️Website Click Here
➡️ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తులు
>చిత్తూరు రూరల్ : జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు పీవోడీటీటీ రమాదేవి గురువారం తెలిపారు. తిరుపతి- 7, మదనపల్లె- 5, నగరి- 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
>పదోతరగతి ఉత్తీర్ణులై 25 నుంచి 45 ఏళ్ల లోపు వారు శనివారం లోపు ఆయా ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
➡️స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు విజయనగరం టౌన్:
>గులాబ్ తుఫాన్ కారణం గా సవరించిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఆధీనంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు చేసుకు నేందుకు మరో నాలుగు రోజులు గడువు పొడి గించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి ఎస్వీ రమణ కుమారి గురువారం ఓ ప్రకట నలో తెలిపారు.
>అభ్యర్థులు విజయనగరం.ఏ పీ.జీఓవీ.ఇ గానీ విజయనగరం . ఎసీ . ఇన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని అక్టోబరు 4 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తుతో పాటు విద్యార్హతల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం లో సమర్పించాలని వివరించారు.
✅️Notification & Application Pdf Click Here