దసరాకు కొత్త పింఛన్లు.. ఈ వర్గాల వారికి మాత్రమే | Dasara New Pensions Cheyutha Pension Scheme
Dasara New Pensions Cheyutha Pension Eligible Beneficiaries : దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతోంది. చేయూత పథకం కింద అర్హులైన కొన్ని వర్గాలకు ఈసారి కొత్త పింఛన్లు అందించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా పూర్తి చేశారు.

అయితే ఈ దఫాలో వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. ప్రస్తుతం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్ బాధితులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
హనుమకొండ జిల్లాలోని 14 మండలాల పరిధిలో కొత్త చేయూత పింఛన్ల కోసం మొత్తం 15,025 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో వితంతువుల నుంచి 7,583, దివ్యాంగుల నుంచి 3,990 దరఖాస్తులు వచ్చాయి.
అలాగే కల్లుగీత కార్మికులు 1,584, ఒంటరి మహిళలు 991, చేనేత కార్మికులు 877, ఫైలేరియా బాధితులు 285, డయాలసిస్ బాధితులు 90 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేశారు. పరిశీలన అనంతరం 13,206 మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఇక తదుపరి దశలో మండల, జిల్లా స్థాయిలో దరఖాస్తులను మరోసారి పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా తుది జాబితా సిద్ధం చేసిన తర్వాత ఎంపికైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.

దసరా పండుగ సందర్భంగా అర్హులైన పేదలకు కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేస్తోంది. తుది పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల జాబితా ఖరారు చేయనున్నారు. ఈ దఫాలో వృద్ధాప్య పింఛన్లకు కాకుండా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల దరఖాస్తులపైనే ప్రక్రియ కొనసాగుతోంది.

