AP పెన్షనర్లకు కొత్త విధానం.. వచ్చే నెల నుంచి అకౌంట్లలోకి కేంద్రం డబ్బులు
AP Pension New System Central Share Bank Accounts : ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల విషయంలో వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 62 లక్షల మంది వివిధ రకాల సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం తన వాటాను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

APలో వచ్చే నెల నుంచి పెన్షన్లకు కొత్త విధానం అమల్లోకి రానుంది. 9.34 లక్షల మంది లబ్ధిదారులకు కేంద్రం వాటా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. వయసు, పెన్షన్ రకాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు కేంద్రం వాటా అందనుంది. ఈ విధానంలో భాగంగా సుమారు 9.34 లక్షల మంది లబ్ధిదారులకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం నేరుగా వారి ఖాతాల్లోకి చేరనుంది. దీనికి సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు.
60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వృద్ధులకు కేంద్రం వాటాగా నెలకు రూ.200 అందనుంది. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులకు రూ.500 చొప్పున జమ చేయనున్నారు. వితంతు పెన్షన్ పొందుతున్న వారిలో 40 నుంచి 79 ఏళ్ల వారికి రూ.300, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 కేంద్ర వాటాగా అందనుంది. అలాగే 18 నుంచి 79 ఏళ్ల వయసున్న దివ్యాంగులకు రూ.300, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 చొప్పున ఇవ్వనున్నారు.
ఈ మొత్తం ప్రస్తుతం అందుతున్న పెన్షన్‌కు అదనంగా కేంద్రం నుంచి వచ్చే వాటాగా ఉంటుంది. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా బ్యాంకు వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఖాతా యాక్టివేషన్, ఆధార్ అనుసంధానం వంటి అంశాలను కూడా సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.

అందువల్ల పెన్షన్ పొందుతున్న వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది. వచ్చే నెల నుంచి కొత్త విధానం అమల్లోకి రానుండటంతో అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం వాటా నేరుగా జమ కానుంది.

