ఏపీ స్పెషల్ టెట్ హాల్ టికెట్లు విడుదల.. రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు | AP Special TET 2026 Hall Tickets Released
AP Special TET 2026 Hall Tickets Released : ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న స్పెషల్ టెట్-2026 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు రేపటి నుంచి తమ హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్పెషల్ టెట్-2026కు మొత్తం 68,420 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్లు టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న పరీక్షా కేంద్రం, సమయం వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి.
స్పెషల్ టెట్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్లో 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చివరి నిమిషంలో కాకుండా కనీసం గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లో పేర్కొన్న పరీక్షా కేంద్రానికే అభ్యర్థులు హాజరు కావాలి.
హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్‌ను పొందవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని పరీక్షకు తీసుకెళ్లడం మంచిది.
అధికారిక వెబ్సైట్లు:
– https://cse.ap.gov.in/
– https://tet2dsc.apcfss.in/
పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌లోని అన్ని వివరాలను ఒకసారి పరిశీలించుకుని, అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.


