తెలంగాణలో ఆటో ఛార్జీల సవరణ.. కొత్త రేట్లు ఇవే
Telangana Auto Charges New Rates 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఆటో ప్రయాణికులకు ప్రభుత్వం కొత్త ఛార్జీలను నిర్ణయించింది. ఆటో మీటర్ ఛార్జీలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఆటో ప్రయాణానికి చెల్లించాల్సిన మొత్తంలో మార్పులు రానున్నాయి.
తెలంగాణలో ఆటో ఛార్జీలను ప్రభుత్వం సవరించింది. మొదటి 1.6 కి.మీకి రూ.30, ఆ తర్వాత ప్రతి కి.మీకి రూ.14, వెయిటింగ్‌కు 75 పైసలు. కొత్త రేట్ల పూర్తి వివరాలు ఇవే.

ఆటోలో ప్రయాణించే సమయంలో వెయిటింగ్‌కు కూడా ఛార్జీ ఉంటుంది. ఇకపై ప్రతి నిమిషం వెయిటింగ్‌కు 75 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.
రాత్రి సమయంలో ప్రయాణించే వారికి ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు ఎక్కువగా వసూలు చేసుకునే అవకాశం డ్రైవర్లకు ప్రభుత్వం కల్పించింది.
ప్రస్తుతం ఆటోల్లో ఉన్న మీటర్లను కూడా కొత్త ఛార్జీలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మీటర్లను మూడు నెలల్లోగా మార్చడం లేదా రీసెట్ చేయడం పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
కొత్త ఛార్జీల అమలుతో ఆటో ప్రయాణానికి సంబంధించిన రేట్లలో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు మీటర్ ప్రకారం నిర్ణయించిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.


