PM Kisan 24వ విడత : రైతుల ఖాతాల్లో రూ.6,000.. అన్నదాత సుఖీభవ నిధులపై కీలక అప్డేట్
PM Kisan 24th Installment Annadata Sukhibhava Funds Update : రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కీలక సమాచారం అందుతోంది. పీఎం కిసాన్ 24వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్న వేళ, నిధుల విడుదల తేదీపై తాజా సమాచారం వెలువడింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.
పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇప్పటికే 23వ విడత నిధులు విడుదల కావడంతో తదుపరి 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 17న పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తేదీపై పూర్తి స్పష్టత వస్తుంది.

ఏపీ రైతులకు అదనంగా అన్నదాత సుఖీభవ : పీఎం కిసాన్ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రూ.6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తాన్ని కలిపి రైతులకు ఆర్థికంగా సహాయం అందించే విధంగా ఈ పథకం కొనసాగుతోంది.
తాజా సమాచారాన్ని బట్టి, పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. దీంతో అర్హత ఉన్న ఏపీ రైతులకు ఒకేసారి నిధులు అందే అవకాశం ఉంటుంది.
e-KYC తప్పనిసరి : పీఎం కిసాన్ నిధులు పొందాలంటే రైతులు తమ e-KYC పూర్తి చేసి ఉండాలి. e-KYC పూర్తి చేయని రైతుల తదుపరి విడత చెల్లింపులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే రైతులు తమ పీఎం కిసాన్ వివరాలు, e-KYC, ఆధార్ లింకింగ్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.
రైతులు ఏం చేయాలి : పీఎం కిసాన్ 24వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు ముందుగా తమ e-KYC స్టేటస్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం సరిగా ఉన్నాయో పరిశీలించాలి. నిధులు విడుదలైన తర్వాత పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో Beneficiary Status ద్వారా చెల్లింపు వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఫార్మా ఐడి కూడా క్రియేట్ చేసుకోవాలి. అక్టోబర్ 17న నిధుల విడుదలపై వస్తున్న సమాచారం అధికారిక ప్రకటనతో ఖరారు కావాల్సి ఉంది. అధికారిక తేదీ ప్రకటించిన తర్వాత రైతులకు పూర్తి స్పష్టత వస్తుంది.


