Asha Worker : 913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం.. కొత్త మార్గదర్శకాలు.. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
AP Asha Worker latest 913 Post, Education Qualification, Age Limit, District-wise post All details : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా అభ్యర్థులకు శుభవార్త.. కొత్తగా ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఆమోదం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.

రాష్ట్రంలో 1294 ఆశా పోస్టుల భర్తీ చేసామని, కొత్తగా 673 పోస్టులు గ్రామీణ ప్రాంతాలలో, 64 గిరిజన ప్రాంతాల్లో & 176 పట్టణ ప్రాంతాల్లో భర్తీ చేస్తున్నట్లు సోమవారం ప్రకటన పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా డిస్టిక్ హెల్త్ సొసైటీ ద్వారా ఈ నియామకాలు చేస్తారని తెలిపారు. కేవలం 10వ తరగతి విద్యా అర్హతతో 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య స్థానిక మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 30వ తేదీ నాటికి జాబితాను పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయితే నెలకు ఆశా కార్యకర్త పోస్టుకు 10,000 వరకు జీతం ఇస్తారు.
అర్హతా ప్రమాణాలు:-
1.ఆశా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో మరియు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ సెక్రటేరియట్లలో శాశ్వత నివాసి అయిన మహిళ అయి ఉండాలి.
2. ఆ ఖాళీ ప్రదేశాలకు కోడలిగా ఉండటం.
3. ప్రాధాన్యంగా వితంతువులు/విడాకులు తీసుకున్న మహిళలు.
4.కనీస విద్యా అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
5. తెలుగు చదవడం, రాయడంలో అనర్గళత, సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలు.
ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. PHCలు & UPHCల సంబంధిత వైద్య అధికారుల కార్యాలయాలకు (ఖాళీలు ఉన్న ప్రాంతాలు – PHCలు & UPHCలు) అప్లై చేసుకోవాలి.
దరఖాస్తుతో పాటు కింది పత్రాలను సమర్పించాలి:
1. తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో అతికించిన పూరించిన దరఖాస్తు ఫారం
2. ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి జారీ చేసిన ఎస్.ఎస్.సి మార్కుల సర్టిఫికెట్ యొక్క స్వీయ ధృవీకరించిన కాపీ
3. సంబంధిత గ్రామీణ సచివాలయాల పంచాయతీ కార్యదర్శి మరియు సంబంధిత వార్డు సచివాలయాల వార్డు నిర్వాహకుడు ధృవీకరించిన నివాస ధృవీకరణ పత్రం
4. విడాకుల కోర్టు కాపీ యొక్క స్వీయ ధృవీకరణ కాపీ (వర్తిస్తే)
5. వితంతువు కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం యొక్క స్వీయ ధృవీకరించిన కాపీ
6. ఆధార్ కార్డు యొక్క స్వీయ ధృవీకరించిన కాపీ
7. రేషన్ కార్డు యొక్క స్వీయ ధృవీకరించిన కాపీ
జిల్లాల వారీగా భర్తీ చేస్తున్న పోస్టు వివరాలు ఇవే
అనకాపల్లిలో 77, తూర్పుగోదావరిలో 44, కర్నూలులో 65, అల్లూరి సీతారా మరాజు జిల్లాలో 43, పశ్చిమగోదావరిలో 42, అన్నమయ్యలో 41, పార్వతీపురం మన్యంలో 43, ప్రకాశంలో 38, కృష్ణాలో 37, విశాఖలో 33, వైఎస్సార్ కడపలో 38, చిత్తూరులో 32, పల్నాడులో 31, కోనసీ మలో 32, విజయనగ రంలో 31, ఎస్పీఎస్ ఆర్ నెల్లూరులో 29, కాకినాడలో 29, ఏలూరులో 27, మార్కాపురంలో 25, అనంతపురంలో 26, శ్రీసత్యసాయి జిల్లాలో 22, గుంటూరులో 21, నంద్యాలలో 21, శ్రీకాకుళంలో 22, పోలవరంలో 21, తిరుపతిలో 21, బాపట్లలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
గమనిక : 913 ఆశా వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే ఎలా తెలుసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన జారీ చేయడం జరుగుతుంది. డిస్టిక్ అఫ్సల్ వెబ్సైటు లేదా న్యూస్ పేపర్లో ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. అర్బన్ ప్రాంతం వారు వార్డ్ సెక్రటేరియట్ పరిధిలోని UPHC మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే గ్రామీణ ప్రాంతం వారు ఆ గ్రామం పరిధిలోని PHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా అందజేయవలెను.

🛑ASHA Worker Application Pdf Click Here
🛑 AP District Wise Official Website Click Here

