ఏపీ లో అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి లోకేష్ ప్రకటన | AP NTR Bharosa Pension 2026

ఏపీ లో అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి లోకేష్ ప్రకటన | AP NTR Bharosa Pension 2026

Andhra Pradesh New NTR Bharosa Pension Scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ లపై మంత్రి లోకేష్ గారు గుడ్ న్యూస్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పెన్షన్ ఇస్తామని మంత్రుల సమావేశంలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ రెండో అప్లికేషన్లు స్వీకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకుగాను ఆధార్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్, ఇన్ కం సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబందిత పత్రం & గడిచిన 6 నెలల కరెంటు బిల్లులు జిరాక్స్ తదితర డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రుల సమావేశంలో నారా లోకేష్ గారు తెలిపారు. వచ్చిన అప్లికేషన్లన్నీ పరిష్కరిస్తూ వెళ్లినట్లు పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు ముఖ్యంగా వితంతువులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వీరు సుమారుగా 1.50 లక్షల మంది ఉన్నారని అంచనా. ఈ నెలలోనే దరఖాస్తులు స్వీకరించి అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో మూడు లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకు గాను సెప్టెంబర్ రెండో వారం నుంచి మొదట వితంతులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత & గీత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ గ్రామంలోని స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకుగాను ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సబ్ డేట్ తో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు కావలసి ఉంటుంది. ప్రస్తుతం మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోతే తప్పనిసరిగా తీసి పెట్టుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తీసి పెట్టుకోండి. ఈ రెండు సర్టిఫికెట్ కోసం టైం పడుతుంది. సెప్టెంబర్ లో అప్లికేషన్ తీసుకొని అక్టోబర్ నుంచి మీకు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి టైం అనేది మీకు ఉండదు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్తగా 3 లక్షల పెన్షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో దరఖాస్తులు స్వీకరణ చేస్తారు. అక్టోబర్ నెల నుంచి పెన్షన్ పంపిణీ చేసేందుకు పరాణాలిక సిద్ధం చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఇప్పటికే 1.5 లక్షల మంది వితంతువులు అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.

NTR Bharosa Pension Scheme 2026 Eligibility & Require Document Details

1. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

2. రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి.

3. వితంతువులు అయితే 18 సంవత్సరాలు వయసు ఉండి, భర్త మరణించిన సర్టిఫికెట్ కలిగిన మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

4. ఒంటరి మహిళలు అయితే 18 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉండి భర్త వదిలేసి ఉండాలి. లేదా 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న అవివాహితులు కూడా అర్హులే.

5. దివ్యాంగుల అయితే వయసుతో సంబంధం లేకుండా సదరం అంచనా ప్రకారం 40% కానీ ఎక్కువ వెహికల్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

5. గీత, చేనేత కార్మికులు 50 సంవత్సరాల వయసు నిండిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

6. గ్రామాలలో 1,50,000, పట్టణాలలో 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలి వాళ్లు అర్హులు.

7. మాగాణి 3 ఎకరాల కన్నా మించి ఉండరాదు. అలాగే మిట్ట భూమి 7.5 ఎకరాలు మించి ఉండరాదు. వీరు అర్హులు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం పూర్తిగా అంచనాలు మాత్రమే.. మరిన్ని వివరాల కోసం స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం వేసి తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *