AP School Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. ఈనెల 26న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవు.. ప్రభుత్వం కీలక ప్రకటన
AP School Milad un Nabi Holidays 2026 date changed: ఆంధ్రప్రదేశ్ లో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ రాష్ట్రంలో మిలాద్ ఉన్ నబీ సెలవు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 25న పబ్లిక్ హాలిడే గా ఉండగా దానిని మారుస్తూ ఆగస్టు 26న బుధవారం సెలవు ప్రకటించారు. తెలంగాణలో కూడా 26న పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం రేపు ఆంధ్ర ప్రదేశ్ లో పబ్లిక్ హాలిడే గా ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు & ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూసివేసి ఉండడన్నాయి. తెలంగాణలో మాత్రం ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. అలాగే 28న రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణలో ఆప్షన్ హాలిడే ఇచ్చారు. అలాగే త్వరలో 10 రోజులు దసరా హాలిడేస్ రానున్నాయి. 2026, అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా హాలిడేస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకారం పట్టించారు. అలాగే ప్రతి శనివారం 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నో బ్యాక్ డే గా ప్రకటించారు.
శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా ఆచరిస్తున్నారు. ఈ వ్రతం కోసం ఉదయం 6 నుంచి 9 వరకు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య పూజ చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల అష్టలక్ష్ములు అనుగ్రహంతో కుటుంబంలో సుఖసంతోషాలు శ్రేయస్సు కలుగుతుందని తెలిపారు. పూజ ముగిసేంతవరకు ఉపవాసం ఉండడం మంచిది.
చంద్ర దర్శన ఆధారంగా ఈ సంవత్సరం మిలాద్-ఉన్-నబీ పండుగను ఆగస్టు 26న వస్తుందని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపారు. అలాగే సెలవు తేదీని సవరించాలని వక్ఫ్ బోర్డ్ సీఈవో చేసిన విజ్ఞప్తి మేరకే సెలవు తేదీని సవరిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 26న సాధారణ సెలవుదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ కార్యదర్శి గారు జె శ్యామల గారు అధికారికంగా జీవో విడుదల చేశారు.


