AP Degree Admissions 2026 : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
AP Degree Admissions Notification 2026 Release : ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ కళాశాల ప్రవేశలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూలు ఉన్నత విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 11 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తర్వాత ఈనెల 20 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈనెల 12, 13వ తేదీలో స్పెషల్ కేటగిరి విద్యార్థులకు పత్రాలు ధ్రువపత్రాలు పరిశీలన నిర్వహిస్తారు. ఆగష్టు 15 మరియు 19 వరకు వెబ్ ఆప్షన్ ఇస్తారు. 26న సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత 27న క్లాసు ప్రారంభమవుతాయి.
ఇంటర్మీడియట్ పూర్తయి డిగ్రీలో ప్రవేశం కోసం వెంటనే ఆన్లైన్ https://apsche.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


