Indiramma Houses : ఇళ్ల లేని వారికి గుడ్ న్యూస్.. స్థలం తో పాటు 5 లక్షలు ఉచితం.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు. వెంటనే అప్లై చేసుకోండి
Indiramma Houses application process required documents : CURE పరిధిలో ఇంద్రమ్మ ఇళ్లకు ఆధార్ కార్డుతో కాకుండా ఓటర్ ఐడి, బ్యాంకు పాసుబుక్, డ్రైవింగ్ లైసెన్స్ తో కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా వెబ్సైట్ లో మార్పులు చేశారని తెలిపారు. స్క్రీన్ ప్రారంభంలో ఆధార్ తప్పనిసరి అటాచ్ చేయవలసి రూల్ ఉండేది, అయితే కొందరు నగరంలో ఉన్నప్పటికీ ఆధార అడ్రస్సు సొంత ఊరికే ఉంది. చాలామంది టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి తమ ప్రాబ్లమ్స్ చెప్పడంతో ఈ మార్పులు చేశారు, అయితే దరఖాస్తులు ఆధార్ నెంబర్ ఇవ్వవలసి అయితే ఉంటుంది.

CURE ఏరియాలో పథకానికి దరఖాస్తు చేసే ఇతర పథకాలు నిలిచిపోతాయని SM ప్రచారంలో ఎటువంటి నిజం లేదని హౌసింగ్ బోర్డు VC గౌతమ్ గారు స్పష్టం చేశారు. ఈ పథకం ఇంటి స్థలం లేని అర్హులైన పేదలకు సొంత ఇల్లు కలను సహకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి అప్లై చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రయోజనాలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇందిరమ్మ ఇంట్లోకి కేటగిరి వారిగా ఎస్సీలకు 14%, ST-5%, BC-16%, దివ్యాంగులకు 5%, ఔట్సోర్సింగ్, చిరు ఉద్యోగులు & పారిశుద్ధ్య కార్మికులకు 10%, ఓపెన్ క్యాటగిరిలో 30% రిజర్వేషన్ ఉంటుంది.
కోర్ అర్బన్ రీజియన్ హైదరాబాదులో లక్ష ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు సేకరణ గడువు ఆగస్టు 10 వరకే మురుస్తుందని మంత్రి పొంగులేటి గుర్తు చేస్తున్నారు. గడువు పొడిగించే ఆలోచన లేదని తెలిపారు. అర్హులు ఆలోపనే అప్లై చేసుకోవాలి. ఇల్లు రాని వారికి రూ.10వేలు డిపాజిట్ డబ్బులు రిఫండ్ చేస్తాం. ఆగస్టు చివర్లలో టవర్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి మధ్యవర్తులను నమ్మవద్దని సూచిస్తున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 040-24603572 నెంబర్ కు ఫోన్ చేయగలరు ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుంది ఇందులో తెలుగు హిందీ, ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో మాట్లాడుతారు.
తొలి దశలో 16 నియోజకవర్గాలలో 7,680 ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో 10,000 చెల్లించేందుకు UPI, నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే తిరిగి అదే ఖాతాకు ఆ అమౌంట్ రిటర్న్ సెండ్ చేయడం జరుగుతుంది. మీసేవ కేంద్రాలు లేదా వాట్సాప్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి వారి యొక్క వార్షిక ఆదాయం 6 లక్షల వరకు ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక అభ్యర్థి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఫ్లాట్లు సంఖ్య కంటే అప్లికేషన్ సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే లాటరీ ద్వారా లోటరీ కేటాయించడం జరుగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.


