తల్లికి వందనం రూ.13,000/- నేడే అకౌంట్లలోకి డబ్బులు.. అర్హుల వివరాలు మన మిత్ర వాట్సాప్ మొబైల్ లో చూడొచ్చు | AP Talliki Vandanam Scheme 2026
AP Talliki Vandanam Scheme 2026 eligible candidates List WhatsApp : ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం నిధులు ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనున్నది. అర్హులైన స్కూలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లుల ఖాతాలో 13 వేల చొప్పున ప్రతి ఒక్క విద్యార్థికి జమ చేయనున్నది. 2026-27 కి గాను 67.47 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42.70 లక్షల మంది తల్లుల ఖాతాలలో రూ.10,120.78 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అర్హత వివరాలు మన వాట్సాప్ మిత్ర & లీప్ యాప్ లో ఈజీగా చూడొచ్చు. అర్హులైన ఒక్కొక్క విద్యార్థికి చెల్లించే 15,000 నుంచి 2000 చొప్పున మినహాయించి మిగిలిన 13000 రూపాయలు తల్లి ఖాతాలో డైరెక్ట్ జమ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి సహాయాన్ని అందజేస్తున్నారు. అలాగే ఆగస్టు 30న రెండో విడుదల అమలు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్న విద్యార్థులకు కుటుంబం ఈ ఆర్థిక భారం కాకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న పథకమే తల్లికి వందనం, ప్రభుత్వం రెండు సంవత్సరం నిధులు బుధవారం బుధవారం బుధవారం బుధవారం బుధవారం బుధవారం బుధవారం విడుదల చేయడానికి సిద్ధమైంది. బుధవారం ఉదయం నుంచే తల్లికి వందనం నిధులు విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం కొత్తగా స్కూల్లో చేరిన విద్యార్థులకు రెండో విడుదలలో ఆగస్టు 30న పథకాన్ని అమలు చేస్తారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు నిధులు జమ ప్రక్రియ కొనసాగుతుంది. ఫిర్యాదులు / రీ-అప్లై గడువు 22 జులై 2026 నుండి 03 ఆగష్టు 2026 కొనసాగుతుంది. ఈరోజు నిధులు తల్లి ఖాతాలో పడకపోతే తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరిగా ఉండాలి. NPCI మ్యాపింగ్ యాక్టివ్ లో ఉండాలి. అలాగే బ్యాంకు ఈకేవిసి తాజా అప్డేట్ అయి ఉండాలి. ఒకసారి బ్యాంకుకు వెళ్లేసి ఇవన్నీ చెక్ చేసుకోండి. అలా సరిగా ఉన్నట్లయితే ఇంకా మీకు డబ్బులు పడకపోతే సచివాలయ ఉద్యోగుల్ని సంప్రదించండి.
అర్హత వివరాలు మన వాట్సాప్ మిత్ర లో ఈజీగా చూడొచ్చు.
1. ముందుగా అభ్యర్థులు తమ వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ ని సెండ్ చేయండి.
2. ఆ తర్వాత Choice Service పైన క్లిక్ చేయండి.
3. Thaliki Vandanam అనే ఆప్షన్ ని ఎంచుకోండి. ఆ తరువాత Thaliki Vandanam status 2026 ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
4. ఆ తరువాత Select the Input Type లో Enrollment Id / Child Aadhaar Number లో ఏదో ఒకటి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
5. విద్యార్థి యొక్క స్టేటస్ అనేది వస్తుంది.


