New Aadhar App తో మీ మొబైల్ లోనే..ఇలా ఫ్రీగా Email ID.. అప్డేట్ చేసుకోండి
New Aadhar App UIDAI free email update in mobile step by step process in Telugu : ఆధార్ యాప్ ద్వారా ఈ జూలై 1 నుంచి ఉచితంగా ఈమెయిల్ అప్డేట్ చేసుకునే అవకాశం UIDAI కల్పించింది. ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండా పౌరులు మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం జూలై 1 నుంచి 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.

కొత్తగా ఆధార్ యాప్ లో ఉచితంగా ఈమెయిల్ అప్డేట్ చేసుకునేందుకు UIDAI చక్కటి అవకాశం కల్పించింది. గడిచిన రెండు రోజులలో 2.5 లక్షల మంది యూజర్ ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇందుకు గాను ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత సర్వీసెస్ సెక్షన్ లో ఈమెయిల్ ఐడి ఆప్షన్ ఎంచుకోవాలి. మీ ID ఎంటర్ చేసి ఈమెయిలు కు వచ్చే ఓటివిని ఎంటర్ చేసుకోవాలి. పేస్ అథారిటీ పూర్తి చేసిన వెంటనే ఈమెయిల్ అప్డేట్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఆధార్ కార్డులో కొత్తగా ఈమెయిల్ యాడ్ చేయాలనుకున్నవారు లేదా మార్చాలనుకున్న వారికి ఆధార్ యాప్ ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తుంది. ఈ ఆధార్ మొబైల్ యాప్ లాంచ్ అయిన ఐదు నెలల 3.1 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే కొత్త మొబైల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 40 లక్షల మంది పైగా మొబైల్ నెంబరు అప్డేట్ చేసుకోవాలని, సుమారుగా 10 లక్షల మంది అడ్రస్ అప్డేట్ చేస్తున్నారని UIDAI ప్రకటించారు.
Aadhar App తో ఈమెయిల్ ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
1. ముందుగా ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్ https://pehchaan.uidai.gov.in/app/download డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే AadhaarFaceRD రెండు యాప్ లోనూ డౌన్లోడ్ చేసుకోవాలి.
2. ఆ తరువాత సర్వీస్ విభాగం కు వెళ్లి ఈమెయిల్ ఐడి ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి.
3. మీ యొక్క కొత్త ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఆపై మీ మెయిల్ కు ఒక ఓటిపి వస్తుంది ఎంటర్ చేయండి.
4. AadhaarFaceRD పూర్తి చేయడంతో ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ అవుతుంది.
5. భవిష్యత్ కోసం ఎకనాలజీమెంట్ స్లిప్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.


