AP ECET 2026 Results : ఏపీ ఈసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
AP ECET 2026 Results Date : ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి అయిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు (AP ECET 2026 results) విడుదల కోసం రంగం సిద్ధమైంది. ఈ AP ECET 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా మండలి చైర్మన్ ఈసెట్ కన్వీనర్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం AP ECET 2026 ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సెట్ కన్వీనర్ దుర్గాప్రసాద్ గారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా AP ECET 2026 పరీక్ష కేంద్రాలు ఈ పరీక్షలు ఏప్రిల్ 23న జరగగా దాదాపుగా 32 వేల మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇతర వివరాల కోసం https://cets.apsche.ap.gov.in/ అధికార వెబ్సైట్ని సంప్రదించండి.


