AP Anganwadi Summer Holidays : అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే
AP Anganwadi Summer Holidays : ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం వేసవి సెలవులు మంజూరు చేశారు. అంగం అంగన్వాడి హెల్పర్ ఈనెల 1 నుంచి 15 వరకు అంగన్వాడి టీచర్ 16 నుంచి 30 వరకు సెలవులు పట్టించారు.

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలియజేశారు.. అంగనవాడిలో పని చేసే అంగన్వాడీ టీచర్ కు మరియు హెల్పర్లకు వేసవి సెలవులు మే నెలలో విడుదల వారీగా మంజూరు చేశారు. అంగనవాడి హెల్పర్ ఉద్యోగులకు ఈనెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు, మరియు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు 16 నుంచి 30 వరకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ కాలంలో అంగన్వాడి కేంద్రం మాత్రం యధావిధిగా పని చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ వేసవి కాలంలో పోషకాహార పథకాలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


