AP 10th Class Re-counting & Re-Verification 2026 Fee Details, Last Date : పదో తరగతి జవాబుపత్రాల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషను ఫీజు, చివరి తేదీ ఎప్పుడంటే?
AP 10th Class Re-counting & Re-Verification 2026 Fee Details, Last Date : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి జవాబు పత్రల జవాబు పత్రాల రీ-కౌంటింగ్, రీ- వెరిఫికేషన్ కు సంబంధించి ఈనెల మే 7 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ యు.వి సుబ్బారావు గారు కోరారు. రీ-కౌంటింగ్ కు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.500 రూపాయలు చెల్లించాలి. రీ వెరిఫికేషన్ కు ఒక్కొక్క సబ్జెక్టు చొప్పున రూ.1000 రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుందని సూచించారు. విద్యార్థులు తమ పరీక్షల ఫలితాలపై ఏదైనా సందేహాలు ఉన్నా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి స్క్రీనింగ్ జవాబు పత్రాలు మన వాట్సాప్ మిత్ర ద్వారా కూడా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష జవాబు పత్రాల రీ-కౌంటింగ్ మరియు రీ- వెరిఫికేషన్ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసు రెడ్డి గారు తెలిపారు. ఆసక్తికరమైన అభ్యర్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా తమ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందుకుగాను రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్టుకు రూ.500 రివెరిఫికేషన్ ఒక్కొక్క సబ్జెక్టుకు రూ. 1000/- చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. అలాగే వెబ్ సైట్ లో డెబిట్, క్రెడిట్ కార్డు & నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చని తెలిపారు. రి వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి జవాబు పత్రాలను ఇప్పటివరకు పాఠశాల లాగిన్ లో మాత్రమే పెట్టగా ఈసారి జవాపత్రాల స్క్రీనింగ్ చేసిన కాపీలను మన మిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ సెకండరీ విద్యా బోర్డు, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 04 తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ టైం టేబుల్ ప్రకటించారు. ఎగ్జామ్ ఫీజును మే ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు చెల్లించవలసిందని తెలిపారు. 50 రూపాయలు లేట్ ఫీతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ కోసం మే 01వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

🛑Official Website Click Here
🛑AP 10th Class Re-counting & Re-Verification 2026

