AP 10th Class Results 2026 Release | How To Download 10th Class Short Memo Step By Step Process
AP 10th Class Results 2026 Release direct link : గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ SSC పబ్లిక్ పరీక్షల మార్చి 2026 సంబంధించి ఫలితాలు ఏప్రిల్ 30, 2026న ఈ రోజులు ఉదయం 11:00 గంటలకు మంత్రి లోకేష్ గారు విడుదల చేస్తున్నారు. విద్యార్థులు అందరికంటే ముందుగా మీ ఫలితం https://results.bse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.
మార్చి 2026 ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ గౌరవ మంత్రి గారు ఏప్రిల్ 30, 2026న ఉదయం 11:00 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం మార్చి 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు ముగిసాయి. ఈ సంవత్సరం పరీక్షలు 6.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

అంతేకాకుండా, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు భాగస్వాముల సౌలభ్యం కోసం ఫలితాలు ఈ క్రింది ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఏకకాలంలో అందించబడతాయి:
1. అధికారిక ఫలితాల పోర్టల్: https://results.bse.ap.gov.in/ ఓపెన్ చేయండి రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే షార్ట్ మెమో మీ ముందుకు వస్తుంది.
2. మాన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) నెం: 9552300009 ద్వారా హాయ్ అని మెసేజ్ చేసి Choice Service పైన క్లిక్ చేయండి. తరువాత Education Service ఇందులో SSC Results ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోండి.
3. పాఠశాల విద్యా శాఖ యొక్క లీప్ యాప్ ఈజీగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
4. DigiLociter App మరియు వెబ్‌సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ SSC results ఈజీగా తెలుసుకోవచ్చు.
ఇంకా, ఫలితాలు విడుదలైన వెంటనే ఆయా పాఠశాలల లాగిన్‌లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంచబడతాయని తెలియజేయడమైనది. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, విద్యార్థులకు ఫలిత పత్రాన్ని జారీ చేయాలి.
ఇంకా, మే 2026 ఎస్ఎస్సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (ASE) టైమ్ టేబుల్‌తో పాటు, జవాబు పత్రాల పునఃపరిశీలన మరియు పునఃలెక్కింపు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించే షెడ్యూల్ మరియు విధానం తగిన సమయంలో అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in లో తెలియజేయబడుతుంది.
విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సంబంధిత వర్గాల వారందరూ ప్రామాణికమైన మరియు తాజా సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ను మాత్రమే విశ్వసించాలని సూచించడమైనది.

🛑BSEAP Official Website Click Here
🛑AP 10th Class Results 2026 Direct Link Click Here


