TTD JOBS : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో ఇంజనీరింగ్ ఉద్యోగాల పరీక్షా షెడ్యూల్ విడుదల
TTD Engineering Jobs Exam Schedule Release : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో ఇంజనీరింగ్ విభాగంలో AEE (సివిల్), AE (సివిల్), ATO (సివిల్), మరియు AEE (ఎలక్ట్రికల్) ఉద్యోగుల సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) సంబంధించిన షెడ్యూల్ TTD షెడ్యూల్ విడుదల చేశారు. మే 10, 11వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ AEE (సివిల్), AE (సివిల్), ATO (సివిల్), మరియు AEE (ఎలక్ట్రికల్) విభాగాలలో ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన వివరాలు
•టిటిడి ఇంజనీరింగ్ AEE (సివిల్), AE (సివిల్), ATO (సివిల్), మరియు AEE (ఎలక్ట్రికల్) విభాగంలో ఉద్యోగుల భర్తీకి ప్రకటన
•10th, 11th మే 2026 తేదీలలో ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
•ఈనెల 29వ తేదీ లోపే పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి.
• మే 2వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షలు షెడ్యూల్ వివరాలు
AEE (సివిల్), AE (సివిల్), ATO (సివిల్), మరియు AEE (ఎలక్ట్రికల్) నియామకానికి సంబంధించిన పరీక్షను షెడ్యూల్ ప్రకారం మే 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు AEE (సివిల్) పరీక్షలు, అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయినా (విద్యుత్) పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే మే 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు AE (సివిల్) పరీక్షలు, అదే తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ATO (సివిల్) పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాల్ టికెట్లు అభ్యర్థులు తాజా సమాచారం కోసం అధికారిక టీటీడీ వెబ్సైట్ (www.tirumala.org)ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది. ప్రాధాన్యతలను సమర్పించడానికి మరియు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ త్వరలో యాక్టివేట్ చేయబడుతుంది.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ హాజరు కావాలని అభ్యర్థులు తనకు అనుకూలమైన పరీక్ష కేంద్రాలను ఆన్లైన్లో ఎంపిక చేసుకోవాలని TTD చూసింది. అందుకుగాను ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పిస్తుంది. పరీక్ష రాసేందుకు అవసరమైన హాల్ టికెట్ మే రెండో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి టిటిడి తెలిపింది. పరీక్షలకు సంబంధించి ఏదైనా సందేశాలు ఉన్నట్లయితే 155257 టిడిపి టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించవచ్చు. లేదా అధికార వెబ్సైటును https://www.tirumala.org/ సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చును.

🛑Exam Center Preferences Click Here
🛑Official Website Click Here

